close

తాజా వార్తలు

20 లక్షల వ్యూస్‌తో.. ఎనిమిదో స్థానంలో..

హైదరాబాద్‌: నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం నుంచి ఇటీవల ‘ప్రియతమా.. ప్రియతమా..’ అనే రెండో లిరికల్‌ పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఎంతో వినసొంపుగా ఉన్న ఈ లిరికల్‌ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా వీక్షించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆలపించారు. శివ నిర్వాణ ‘మజిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. అదీకాకుండా పెళ్లయ్యాక చై, సామ్‌ జంటగా నటించిన చిత్రమిది కావడం మరో విశేషం. షైన్‌ స్క్రీన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌ మరో కథానాయికగా నటించారు. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సాయంత్రం ‘నా గుండెల్లో’ అనే మూడో లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని సమంత ట్విటర్‌ ద్వారా ప్రకటిస్తూ నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌కు సంబంధించిన పోస్టర్‌ను పంచుకున్నారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.