close

తాజా వార్తలు

జైలుకెళ్లక ముందు ఏం చేసేవాడినో నీకు తెలియదు

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్తీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకుడు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. పదేళ్ల శిక్ష పడిన యోగీశ్వరన్‌ అలియాస్‌ దిల్లీ అనే ఖైదీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అతన్ని ఎవరు తప్పించారు? బయటకు వచ్చిన తర్వాత అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తదితర ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభులు నిర్మిస్తున్నారు. శామ్‌ సీ.ఎస్‌ సంగీతం అందించారు. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.