
తాజా వార్తలు
● అధికారిణి నియామకంపై న్యాయ పోరాటం
● నడిగర్ సంఘం ప్రతినిధులు నాజర్, కార్తి
విలేకర్ల సమావేశంలో కార్తి, నాజర్, పూచ్చి మురుగన్
కోడంబాక్కం, చెన్నై, న్యూస్‌టుడే: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నిర్వహణకు ప్రత్యేక అధికారిణిగా రిజిస్ట్రేషన్ల శాఖ సహాయ ఐజీ గీత నియమితులయ్యారు. ఇలా ఆమెను నియమించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో భాగమేనని ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తిక్ ఆరోపించారు. నడిగర్ సంఘానికి సంబంధించి ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం ఆదేశాల వల్ల ఈ ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. అందువల్ల నాజర్ నేతృత్వంలోని కార్యవర్గమే ప్రస్తుతం సంఘ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ప్రభుత్వం ప్రత్యేక అధికారిణిని నియమించింది. దీనిపై నాజర్, కార్తిలతోపాటు పూచ్చి మురుగన్ కూడా పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ పలువురు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న సంఘమిది. మేం ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులన్నీ తీర్చాం. సంఘం కోసం పెద్ద భవనాన్ని నిర్మించాం. గతంలో ఉన్న నిర్వాహకులు చేసిన తప్పులను మేం చేయకూడదని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఈ సారి ఎన్నికలకు పలురకాల సమస్యలు వచ్చినప్పటికీ చట్టపరంగా ఎదుర్కొన్నాం. తాజాగా నియమించిన అధికారిణికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మాపై ఎలాంటి నేరారోపణలు లేనప్పుడు ఇలా నియమించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంతో సమానమే. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. ఇటీవల మంత్రులతో కూడా చర్చలు జరిపాం. ఆ విషయాలను పూర్తిగా చెప్పలేం. గత ఏప్రిల్ వరకు సీనియర్ సభ్యులకు పింఛను ఇచ్చాం. ఇప్పుడు కేసు నడుస్తున్నందువల్ల భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయాయి. తదుపరి కార్యవర్గం అధికారంలోకి వస్తేనే పనులు సాగుతాయని’’ పేర్కొన్నారు.
ప్రత్యేక అధికారిణిగా గీత: నడిగర్ సంఘం 2015-18 కాలానికిగాను నిర్వాహకుల పదవీ కాలం గత ఏడాది ముగిసింది. కొత్త నిర్వాహకుల ఎన్నికకు ఈ ఏడాది జూన్ 23న ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. నుంగంబాక్కంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ శాఖ లాకర్లో ఓట్లను భద్రపరిచారు. ఈ ఎన్నికలు, ఫలితాల వెల్లడిని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాత పూర్వక వాదనలు దాఖలు చేయాలంటూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం స్తంభించినట్టు అభిప్రాయపడుతున్నామని, దానికి ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించకూడదంటూ నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌కు రిజిస్ట్రేషన్ల శాఖ నోటీసులు పంపింది. దీనికి సంబంధించిన లేఖనూ నడిగర్ సంఘం నోటీసు బోర్డులో ఉంచింది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్న నేపథ్యంలో నడిగర్ సంఘానికి ప్రత్యేక అధికారిణిగా రిజిస్ట్రేషన్ల శాఖ సహాయ ఐజీ గీతను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె పర్యవేక్షణలో ఇకపై నడిగర్ సంఘం కార్యకలాపాలు జరుగుతాయని తెలిపింది. గతంలో ఇదే తరహాలో సినీ నిర్మాతల సంఘానికి ప్రత్యేక అధికారిగా ఎన్.శేఖర్‌ను నియమించడం గమనార్హం.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
