
తాజా వార్తలు
హైదరాబాద్: గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కీరవాణి తనయుడు కాల భైరవ. ఇటీవల కాలంలో ‘బాహుబలి’, ‘అరవింద సమేత’, ‘జెర్సీ’ చిత్రాల్లో ఆయన పాడిన పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా ‘పెనిమిటి’ పాటకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఆయన తన తొలి మ్యూజిక్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘విరిసే.. విరిసే’ అంటూ సాగే ఈ పాటకు సాహిత్యం, బాణీలు ఎం.ఎం.కీరవాణి అందించారు. శ్రీ సింహా కోడూరి, పృథ్వీ దర్శకత్వం వహించిన ఈ పాటకు నోయల్ సహకారం అందించారు. అంజనీ, నిఖిలతో కలిసి కాలభైరవ ఈ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా పాటను పంచుకుంటూ.. ‘నవ్వులు, భావోద్వేగాల ప్రపంచంలో నిజమైన నవ్వును కలిగి ఉండటం ఎప్పటికీ అదృష్టమే. ఇది నా మొదటి మ్యూజిక్ వీడియో. సంగీతం, సాహిత్యం నాన్నదే(కీరవాణి), శ్రీ సింహా, పృథ్వీ దర్శకత్వం వహించారు. మీ సహకారానికి థ్యాంక్యూ నోయల్ అన్నా’’ కాల భైరవ ట్విటర్ వేదికగా వీడియోను పంచుకున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
