close

తాజా వార్తలు

మరాఠా యోధుడు వచ్చేశాడు!

ఇంటర్నెట్‌డెస్క్‌: చారిత్రక అంశంతో మరో చిత్రం వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. మరాఠా యోధుడు తానాజీ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. ఛత్రపతి శివాజీకి వెన్నుదన్నుగా నిలిచిన సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. 

టైటిల్‌ రోల్‌లో అజయ్‌దేవగణ్‌ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో కాజోల్‌ నటిస్తోంది. మొఘలుల సైనికాధికారి ఉదయ్‌భన్‌ రాఠోడ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం అజయ్‌దేవ్‌గణ్‌, సైఫ్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. తానాజీకి, ఉదయ్‌భన్‌ రాఠోడ్‌ల మధ్య సిన్హాఘడ్‌ యుద్ధం చరిత్రకెక్కింది. ఆ నేపథ్యాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 

ఓం రావత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని అజయ్‌దేవగణ్‌ ఫిల్మ్స్‌, టీసిరీస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో ఛత్రపతి శివాజీ పాత్రలో శరద్‌ కేల్కర్‌, షీలార్‌ మామగా జగపతిబాబు తదితరులు కనిపించనున్నారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.