News in pics : చిత్రం చెప్పే విశేషాలు (29-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 29 Apr 2024 03:52 IST
1/8
హైదరాబాద్‌: మాదాపూర్‌ శిల్పారామంలో ఆదివారం అంతర్జాతీయ నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదర్శించిన కూచిపూడి నృత్యం నయనానందకరంగా సాగింది.సంజన, అనురిత, సహన, యజ్ఞ, చైత్ర హాసిని, సౌమ్య, సంయుక్త, శశికళ, వైష్ణవి, మృత్యుంజయ శర్మ, సర్వాణిలు తమ నృత్యకౌశలంతో ఆకట్టుకున్నారు.

2/8
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ప్రముఖ శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున పొన్న వాహనంపై మురళీకృష్ణ అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం వెంట సాగుతూ మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది.

3/8
అమరావతి: పీబీ సిద్ధార్థ కళాశాల మైదానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జయహో భారతీయం ఆధ్వర్యంలో శ్రీలలితా సహస్రనామ మహాబృంద పారాయణాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా హాజరై కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు.

4/8
శ్రీకాకుళం: కొత్తూరు మండలంలోని ఉప్పరపేట గ్రామస్థులంతా ఆదివారం ఊరి చెరువులో చేపలకు ఎగబడ్డారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా చేపలు పట్టుకున్నారు. గ్రామస్థులంతా చేపలు పట్టుకుంటూ సందడి చేస్తుండటాన్ని చిత్రంలో చూడొచ్చు. గ్రామంలో దాదాపు అందరి ఇంట్లోనూ చేపల కూర వాసనే.

5/8
కరీంనగర్‌: వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన సంటి జ్యోతి, స్టాండ్లిన్‌ దంపతుల ఇంటి పెరటిలో మే పుష్పం ముందుగానే వికసించి స్థానికులను ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయంగా ఉన్న ఈ పువ్వుతో స్వీయచిత్రాలు తీసుకుంటున్నారు.

6/8
మెదక్‌: సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజూ 200 మంది శిబిరానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు.

7/8
హైదరాబాద్‌: గచ్చిబౌలి డివిజన్‌లోని గోపనపల్లితండా వద్ద ఒకవైపు తెల్లాపూర్‌ నుంచి, మరోవైపు నల్లగండ్ల నుంచి నానక్‌రాంగూడ మీదుగా బాహ్యవలయ రహదారిని కలిపేలా నిర్మించిన వంతెన పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. దీంతో రద్దీ లేకుండా వాహనదారులు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లొచ్చు.

8/8
హైదరాబాద్‌: నాంపల్లి నుంచి అసెంబ్లీ మార్గంలో ప్రతి మూడు నెలలకోసారి ఆరడుగుల మొక్కలు నాటడం ఆనవాయితీ. వాటి సంరక్షణకు ట్రీగార్డులు లేక ఆ మొక్కలు మానులుగా ఎదరగక పోవడమూ అంతే ఆనవాయితీగా తయారైంది.

Tags :

మరిన్ని