వారితో పొత్తు పెట్టుకోం: సోము వీర్రాజు

తాజా వార్తలు

Published : 20/12/2020 02:51 IST

వారితో పొత్తు పెట్టుకోం: సోము వీర్రాజు

కర్నూలు: భవిష్యత్తులో వైకాపా, తెదేపాతో భాజపా పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం రాయలసీమలోని ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒత్తిడి చేస్తుందో.. అలాగే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రణాళిక విడుదల చేయాలని సోము వీర్రాజు కోరారు. రూ.10 వేల కోట్ల నిధులతో రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో బంగారం దొరుకుతుంది కానీ ఇసుక దొరకడంలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక చౌకగా లభించిందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని