Raghurama: విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు: రఘురామ

తాజా వార్తలు

Published : 19/08/2021 01:24 IST

Raghurama: విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు: రఘురామ

దిల్లీ: ఏపీలో విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు ఎదురవుతున్నాయని.. యాజమాన్యాలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘‘నాడు- నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు రంగులేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ప్రైవేటు బడుల్లో పని చేస్తున్న వారితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో పాఠశాల నిర్వహకులైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంపై రఘురామ విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని