BJP: భాజపాలో చేరిన రాహుల్‌ సన్నిహితుడు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BJP: భాజపాలో చేరిన రాహుల్‌ సన్నిహితుడు

కాంగ్రెస్‌కు జితిన్‌ ప్రసాద రాజీనామా  

దిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్‌ గాంధీకి సన్నిహితునిగా పేరుపొందిన యువ నాయకుడు జితిన్‌ ప్రసాద (47) బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. బ్రాహ్మణ సామాజిక వర్గంపై మంచి పట్టు ఉన్న ఆయన పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టం కలిగించేదేనని పరిశీలకులు భావిస్తున్నారు. జితిన్‌ తండ్రి జితేంద్ర ప్రసాద కూడా కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉండేవారు. 1999లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తూ సోనియా గాంధీపైనే పోటీ చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలంటూ గతేడాది సోనియాకు లేఖ రాసిన 23 మంది నాయకుల్లో జితిన్‌ కూడా ఉన్నారు. రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన 2008లో కేంద్ర ఉక్కు, పెట్రోలియం, రహదారులు, విద్యాశాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. జితిన్‌ దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో భాజపాలో చేరారు.  అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు