close

తాజా వార్తలు

Published : 18/01/2021 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐసీయూలో భారత దిగ్గజ స్పిన్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 ఏళ్ల చంద్రశేఖర్‌ మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జనవరి 15న ఆసుప్రతిలో చేరారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరో రెండు రోజుల్లో వైద్యులు ఆయన్ను ఇంటికి పంపిస్తారు.

‘‘చంద్రశేఖర్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో అకస్మాతుగా అలసటకు గురై ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారు’’ అని చంద్రశేఖర్ భార్య సంధ్య తెలిపారు. చంద్రశేఖర్‌ ఆరోగ్యంపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి స్పందిస్తూ.. ‘ఆయన ఐసీయూలో ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని వెల్లడించారు.

చంద్రశేఖర్ కర్ణాటకలో జన్మించారు. అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను ఎన్నోసార్లు విజేతగా నిలిపారు. 58 టెస్టులు ఆడిన ఆయన 242 వికెట్లు పడగొట్టారు. 16 సార్లు అయిదు వికెట్లు, రెండు సార్లు పది వికెట్లు పడగొట్టారు. ఆయన విదేశాల్లో ఆడిన అయిదు టెస్టుల్లో 42 వికెట్లు తీశారు. ఆ మ్యాచ్‌ల్లో భారత్ విజయ ఢంకా మోగించింది. ఎన్నో ఏళ్లు భారత జట్టుకు మ్యాచ్‌ విన్నర్‌గా సేవలు అందించాడు.

ఇదీ చదవండి

చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్‌

కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్‌



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని