షెఫాలీ.. మళ్లీ నంబర్‌ వన్‌

తాజా వార్తలు

Published : 24/03/2021 01:43 IST

షెఫాలీ.. మళ్లీ నంబర్‌ వన్‌

దుబాయ్‌: టీమ్‌ఇండియా టీనేజ్‌ సంచలనం, విధ్వంసకర బ్యాటర్‌ షెఫాలీ వర్మ తిరిగి అగ్రస్థానం చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఆమె మెరుపులు మెరిపించింది. తొలి రెండు టీ20ల్లో 23, 47తో విరుచుకుపడింది.

ప్రస్తుతం షెఫాలీ వయసు 17 ఏళ్లు మాత్రమే. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను నాకౌట్‌ దశకు తీసుకెళ్లినందుకు ఆమె తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రెండో ర్యాంకుకు చేరుకుంది. తాజా మెరుపులతో బెత్‌ మూనీని దాటుకొని అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇక సఫారీ క్రీడాకారిణి లిజెల్‌ లీ 3 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు అందుకుంది. లారా వోల్వార్డ్‌ 5 స్థానాలు మెరుగై 24, సన్‌ లూస్‌ 5 స్థానాలు మెరుగై 38, నదిన్‌ డి క్లెర్క్‌ మూడు స్థానాలు ఎగబాకి 74కు చేరుకున్నారు.

టీమ్‌ఇండియా నుంచి దీప్తిశర్మ 4 స్థానాలు మెరుగై 40వ ర్యాంకు అందుకుంది. యువ బ్యాటర్‌ రిచా ఘోష్‌ ఏకంగా 59 స్థానాలు ఎగబాకి 85 ర్యాంకుకు చేరుకుంది. ఆల్‌రౌండర్‌ హర్లీన్‌ డియోలో బ్యాటర్ల జాబితాలో 262 స్థానాలు మెరుగై 99, బౌలర్లలో జాబితాలో 76 స్థానాలు మెరుగై 146కు చేరుకుంది. స్పిన్నర్‌ రాజేశ్వరీ గైక్వాడ్‌ 34 నుంచి 25కు ఎగబాకింది. వన్డేల్లో మిథాలీ ఒక స్థానం మెరుగై 8, ప్రియా పునియా 5 స్థానాలు మెరుగై 53, గైక్వాడ్ (బౌలింగ్‌)‌ 8 స్థానాలు మెరుగై 38కి చేరుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని