KL Rahul: మీరు ఒకరి వెంట పడితే మేం 11 మంది మీ వెంట పడతాం..

తాజా వార్తలు

Updated : 17/08/2021 10:14 IST

KL Rahul: మీరు ఒకరి వెంట పడితే మేం 11 మంది మీ వెంట పడతాం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మీరు ఒకడి వెంట పడితే మేం మొత్తం 11 మందిమి మీ వెంట పడతాం’ అని అంటున్నాడు టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌. కవ్వింపులకు తామేమీ భయపడమని, ఘాటుగానే బదులిస్తామని అన్నాడు. ఆంగ్లేయులు జస్ప్రీత్‌ బుమ్రాను లక్ష్యంగా ఎంచుకోవడంపై అతడు స్పందించాడు. ఇంగ్లాండ్‌పై గెలిచి సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లినందుకు సంతోషంగా ఉందన్నాడు. టీమ్‌ఇండియా 151 పరుగుల భారీ తేడాతో గెలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన అతడిని మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం వరించింది.

‘రెండు కఠినమైన జట్లు తలపడితే ఇలాగే ఉంటుంది. గొప్ప పోరాటాలు దర్శనమిస్తాయి. గొప్ప నైపుణ్యాలు బయటపడతాయి. ఈ పోరాటం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. శ్రుతి మించని కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. మీరు మాలో ఒకరి వెంట పడితే మేం మొత్తం 11 మందిమి మీ వెంట పడతాం’ అని రాహుల్‌ అన్నాడు.

‘ఆ కవ్వింపులే మా బౌలర్లలో కసి పెంచాయి. తమ సత్తా ఏంటో చూపించాలని అనుకున్నారు. ఈ మ్యాచులో వారి ప్రదర్శన అసమానం. ఎంత పొగిడినా తక్కువే. శతకం కొట్టిన తర్వాత ప్రతి రోజు లార్డ్స్‌ ఆనర్‌ బోర్డును చూస్తున్నాను. నా పేరు శాశ్వతంగా ఎప్పుడు చెక్కుతారా అని ఆత్రుత చెందాను. ఇప్పటికైతే అక్కడ తాత్కాలికంగా కాగితంపై అంటించారు. టీమ్‌ఇండియా విజయానికి నా శతకం ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్‌ వెల్లడించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని