Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోజాస్‌ 

తాజా వార్తలు

Published : 01/08/2021 20:48 IST

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోజాస్‌ 

టోక్యో: ఒలింపిక్స్‌లో మహిళల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో వెనుజ్‌వెలాకు చెందిన యూలిమర్‌ రోజాస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ ఫైనల్లో రోజాస్‌ పలుమార్లు ప్రయత్నించి 15.67 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దాంతో 1995 నాటి ఉక్రెయిన్‌ అథ్లెట్‌ ఇనెస్సా క్రావెట్స్‌ పేరిట ఉన్న 15.50 మీటర్ల రికార్డును బద్దలుకొట్టింది. కాగా, రోజాస్‌ 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఈ విభాగంలో రజతం సాధించింది. ఈ క్రమంలోనే అప్పుడు చేజారిన బంగారు పతకాన్ని ఇప్పుడు కైవసం చేసుకుంది. ఇక ఈ పోటీల్లో పోర్చుగల్‌కు చెందిన పాట్రిసియా మమోనా 15.01 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. స్పెయిన్‌కు చెందిన పెలెటీరో 14.87 మీటర్లతో మూడో స్థానంలో కాంస్యంతో సరిపెట్టుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని