Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 156684
            [news_title_telugu_html] => 

ధోని @ ఆర్మీ

[news_title_telugu] => ధోని @ ఆర్మీ [news_title_english] => [news_short_description] => మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా.. లేదా..? అతడు అందుబాటులో ఉంటే సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తారా.. తప్పించి యువ వికెట్‌ కీపర్‌కు అవకాశమిస్తారా..? ధోని భవితవ్యమేంటి..? ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమి తర్వాత మొదలైన ప్రశ్నలివి! వీటికి ధోని తాత్కాలికంగా తెరదించాడు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
ధోని @ ఆర్మీ - EENADU
close
ధోని @ ఆర్మీ

రెండు నెలలు సైనిక సేవలో

విండీస్‌ పర్యటనకు దూరం
ఇప్పట్లో రిటైర్మెంట్‌ లేనట్లే

మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా.. లేదా..? అతడు అందుబాటులో ఉంటే సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తారా.. తప్పించి యువ వికెట్‌ కీపర్‌కు అవకాశమిస్తారా..? ధోని భవితవ్యమేంటి..? ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమి తర్వాత మొదలైన ప్రశ్నలివి! వీటికి ధోని తాత్కాలికంగా తెరదించాడు. పారా మిలటరీలోని పారాచూట్‌ సైనిక దళ విభాగంలో రెండు నెలలు పనిచేయాలని నిర్ణయించుకొన్న అతడు తనంతట తానే జట్టు ఎంపిక ప్రక్రియకు దూరమయ్యాడు.

దిల్లీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు ధోని ఉంటాడా లేదా అన్న చర్చకు తెర. పారామిలటరీ రెజిమెంట్‌లో పని చేయాలని  నిర్ణయించుకున్న ధోని ఆట నుంచి విరామం తీసుకున్నాడు. అతడు ఎనిమిదేళ్ల నుంచి పారాచూట్‌ సైనిక విభాగంలో గౌరవ లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్నాడు. రెండు నెలలు సైనికుడిగా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు రెండు రోజుల క్రితమే బీసీసీఐ ఉన్నతాధికారిని వ్యక్తిగతంగా కలిసి కోరాడని తెలిసింది. విండీస్‌ పర్యటన కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకూడదని తెలిపాడు. తాజాగా అదే విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి.. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ‘‘ధోని విండీస్‌ పర్యటనకు ఎందుకు దూరం కావాలనుకుంటున్నాడో బీసీసీఐ ప్రతినిధిని వ్యక్తిగతంగా కలిసి వివరించాడు. ప్రపంచకప్‌ ఆరంభానికి ముందే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది కేవలం రెండు నెలల విరామం మాత్రమే. రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతడి నిర్ణయాన్ని కెప్టెన్‌ కోహ్లి, సెలక్టర్లకు తెలియజేశాం’’ అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. సైనిక విభాగంలో పనిచేయాలనే ధోని నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఎప్పుడూ ముందే

క్రికెట్లో భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ధోని... లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో సైనిక పరమైన కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుంటాడు. 2011లో గౌరవ హోదా పొందిన ధోని పారాచూట్‌ విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఐదుసార్లు పారా జంప్‌ చేసిన అతడు 2015లో పారాట్రూపర్‌ గుర్తింపు పొందాడు. వివిధ సందర్భాల్లో ధోని  దేశభక్తి చాటుతూనే ఉన్నాడు. నిరుడు పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించేందుకు అతను సైనిక దుస్తుల్లో వచ్చాడు. ధోని హెల్మెట్‌పై జాతీయ పతాకం ఉండదు. ఎందుకంటే వికెట్‌కీపర్‌గా హెల్మెట్‌ను నేలపై పెట్టాల్సి ఉంటుంది. అలా త్రివర్ణ పతాక గుర్తును నేలపై ఉంచడం ఇష్టంలేక అతడు ఏర్పాటు చేసుకోలేదు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గ్లోవ్‌పై సైనిక చిహ్నం ‘‘బలిదాన్‌’’తో బరిలో దిగాడు. సైన్యంలో చేరడం తన కల అని.. అది గౌరవ హోదాలోనైనా  నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని ధోని చాలా సందర్భాల్లో చెప్పాడు.

క్రికెట్‌ ముగిశాకే సైన్యమన్నాడు..!

ధోని కెరీర్‌పై చర్చ వేడెక్కుతున్న సమయంలో అతడు అనూహ్యంగా ఆటకు రెండు నెలల విరామం ప్రకటించాడు. ఇంతకీ ధోని వ్యూహమేంటి..? వెస్టిండీస్‌ పర్యటన ముగిశాక జట్టు ఎంపికకు అతడు అందుబాటులోకి వస్తాడా? వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ వరకు జట్టులో ఉండాలని భావిస్తున్నాడా? లేదంటే ఇక్కడితో ముగించేశాడా..?
ధోని రిటైర్మెంట్‌పై చర్చ ఇప్పటిది కాదు.. నాలుగేళ్లు ముందు  ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే మొదలైంది. అప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పేసిన అతడు వన్డేలు, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు ప్రపంచకప్‌ ముగియడంతో అంతా అతడి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ధోని వారసుడిగా గుర్తింపు పొందిన రిషబ్‌ పంత్‌ జట్టులో ఉండటంతో జట్టులో మహీ అవసరమేంటని వాదించేవారూ లేకపోలేదు. ఒకప్పటిలా ఆడలేకపోతున్న ధోని స్థానంలో యువ క్రికెటర్‌కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజానికి ధోని జట్టును పట్టుకుని వేలాడే రకం కాదని తెలిసిన విషయమే. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్న ధోని.. జట్టు 0-2తో టెస్టు సిరీస్‌ కోల్పోగానే కెప్టెన్సీతో పాటు ఏకంగా టెస్టు క్రికెట్‌కే వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు. వయసు పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ జట్టులో అతడిది కీలకపాత్ర. మిడిలార్డర్‌ బలహీనంగా ఉండటంతో పాటు.. ఇంకా కుర్రాళ్లు జట్టులో కుదురుకోని నేపథ్యంలో తన లోటు తెలియనంత వరకు అతడు జట్టుతో ఉంటాడని.. జట్టులో ఉన్నా తుది జట్టులో ఆడడని ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఇవన్నీ ఊహాగానాలే. అసలు అందుకు ధోని సిద్ధంగా ఉన్నాడా? ఒకవేళ అతడు సిద్ధపడినా.. సెలెక్టర్ల బృందం, బోర్డు ఒప్పుకుంటాయా అన్నది ప్రశ్నే. ఏదేమైనా రెండు నెలల విరామంతో ధోని రిటైర్మెంట్‌పై నెలకొన్న చర్చకు తాత్కాలికంగా బ్రేకులు వేశాడు. ఈ వేడి చల్లారిన తర్వాత ఏదో ఒక రోజు అతడు బోర్డుకు లేఖ పంపి ఇక ఆడనని తేల్చేసినా ఆశ్చర్యమేం లేదు. 2012లో సియాచిన్‌ బేస్‌ క్యాంపు సందర్శన సమయంలో ధోని మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు నేను ఇక్కడి వరకు రాగలిగానంటే అది క్రికెట్‌ వల్లే. క్రికెట్‌ ముగిసిన తర్వాత సైనికుడిగా సేవలు అందిస్తా. ఇప్పుడే వచ్చి నాలోని క్రికెటర్‌ను దెబ్బతీయాలని అనుకోవట్లేదు. క్రికెట్‌ కెరీర్‌  ముగిశాక కచ్చితంగా ఆర్మీలో పనిచేస్తా’’ అని అన్నాడు. సైన్యంలో పనిచేయడం కోసం ఇప్పుడు అతడు విరామం   తీసుకోవడం దేనికి సంకేతం!

- ఈనాడు క్రీడావిభాగం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.