close

తాజావార్తలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న విండీస్‌

ముంబయి: భారత్‌ X వెస్టిండీస్‌ జట్ల మధ్య మరికాసేపట్లో నిర్ణయాత్మక మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కరీబియన్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలవడంతో ఫైనల్‌ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా టీమిండియా విండీస్‌ పర్యటన సందర్భంగా కరీబియన్‌ జట్టును వైట్‌వాష్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీసేన స్వదేశంలోనూ విజయ కేతనం ఎగరవేయాలని చూస్తుండగా విండీస్‌ ఇక్కడ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జడేజా స్థానంలో మహ్మద్‌ షమి జట్టులోకి రాగా.. చాహల్‌ స్థానంలో కుల్‌దీప్‌ చోటు దక్కించుకున్నాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ షమి.

విండీస్‌ జట్టు: లెండిల్‌ సిమన్స్‌, ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌, షిమ్రన్‌ హెట్మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), జేసన్‌ హోల్డర్‌, కారీ పీర్‌, హేడెన్‌ వాల్ష్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కేసరిక్‌ విలియమ్స్‌.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.