రుయా ఘటనపై విచారణ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుయా ఘటనపై విచారణ

తిరుపతి ఆర్డీవో నేతృత్వంలో కమిటీ

ఈనాడు, తిరుపతి : రుయా ఆసుపత్రి(తిరుపతి)లో ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ కమిటీ శుక్రవారం తన విచారణను ప్రారంభించింది. ఆర్డీవో నేతృత్వంలోని ఈ కమిటీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో హేమలత, తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ, మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈఈ ధనుంజయ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ ఈ కమిటీని నియమించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందనే అంశాలను కమిటీ పరిశీలించింది. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే సంస్థతో రుయాకు ఉన్న ఒప్పందాలను తెలుసుకుంది. ఒప్పందం ప్రకారం ఎంత సరఫరా చేయాలి, ప్రస్తుతం ఎంత అందిస్తున్నారనేదానిపై ఆరా తీశారు. ఘటన జరిగిన రోజు ఎన్ని గంటలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ రావాలి, ఏ సమయంలో వచ్చిందనే వివరాలను రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి ద్వారా తెలుసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎంఎం వార్డులో ఉన్న నర్సులు కొందరిని కూడా విచారించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించినట్లు ఆర్డీవో తెలిపారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ కూడా శాఖాపరమైన విచారణ నిర్వహిస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు