సీఎంకు కృతజ్ఞత సభలు.. టీఎన్జీవోల సమావేశం నిర్ణయం

ప్రధానాంశాలు

సీఎంకు కృతజ్ఞత సభలు.. టీఎన్జీవోల సమావేశం నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల ప్రయోజనార్థం 30 శాతం ఫిట్‌మెంట్‌ ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించనున్నట్లు టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ తెలిపారు. కరీంనగర్‌ నుంచి వీటిని ప్రారంభిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలని అభ్యర్థించారు. పీఆర్‌సీలో వ్యత్యాసాలను సవరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పీఆర్‌సీతో వేతనాలు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆదాయ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని అభ్యర్థించారు. ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసు అర్హతను శాశ్వతంగా రెండేళ్లుగా చేయాలని కోరారు. బుధవారం జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేశారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని