విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ సలహాదారుల ఎంపికకు టెండర్ల ప్రకియ పూర్తి

ప్రధానాంశాలు

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ సలహాదారుల ఎంపికకు టెండర్ల ప్రకియ పూర్తి

ఈనాడు, దిల్లీ : విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖలోని డిజిన్వెస్ట్‌ విభాగం చేపట్టిన లావాదేవీల, న్యాయ సలహాదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఎంపిక కోసం నిర్వహించిన టెండర్లలో న్యాయ సలహాదారు కోసం దిల్లీకి చెందిన చందోయిక్‌ అండ్‌ మహాజన్‌ సంస్థ, లావాదేవీ సలహాదారు టెండర్‌లో ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ అతి తక్కువకు కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచినట్లు తెలిసింది. న్యాయ సలహాదారు కోసం చందోయిక్‌ అండ్‌ మహాజన్‌ సంస్థ రూ.17లక్షలు (ఎల్‌1), జె.సాగర్‌ అసోసియేట్స్‌ రూ.73.50 లక్షలు (ఎల్‌2), లింక్‌ లీగల్‌ రూ.75 లక్షలు (ఎల్‌3)కి టెండర్‌ కోట్‌ చేశాయి. లావాదేవీ సలహాదారు కోసం ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ రూ.49.50 లక్షలు (ఎల్‌1), జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌ రూ.90 లక్షలు (ఎల్‌2), ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్‌ లిమిటెడ్‌ రూ.94.50 లక్షలు (ఎల్‌3), డెలాయిట్‌ టీటీ ఇండియా రూ.98.70 లక్షలకు (ఎల్‌4) టెండర్లు కోట్‌ చేశాయి. ఇందులో అతి తక్కువకు కోట్‌చేసి ఎల్‌1గా నిలిచిన సంస్థలను సలహాదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎల్‌1, ఎల్‌2గా నిలిచిన సంస్థల మధ్య టెండర్‌ కొటేషన్లలో భారీ వ్యత్యాసం ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని