10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌!
close

Published : 05/02/2021 17:17 IST

10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ అంటే ఒకప్పుడు కేవలం ఫోన్‌ పనితనం, కెమెరా, బ్యాటరీ ఇవే చూసేవాళ్లు. ఇప్పుడు ఆ జాబితాలో ఫోన్‌ ఎంతసేపటిలో ఛార్జ్‌ అవుతుందనేది కూడా వచ్చి చేరింది. ఇప్పటికే మొబైల్‌ తయారీ కంపెనీలు వివిధ రకాల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మరింత వేగంగా ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ షావోమి సైతం అదే పనిచేస్తోంది.

200W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని షావోమి అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ సదుపాయంతో కేవలం మీ మొబైల్‌ ఫోన్‌ను 10 నిమిషాల్లోనే ఛార్జ్‌ చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ టెక్నాలజీని ఈ ఏడాదిలోనే తీసుకురానుందట. ఎంఐ ఫోల్డబుల్‌ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్న షావోమి.. ఆ మైబైల్‌తోనే కొత్త ఛార్జింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. అయితే, ఎప్పుడు తీసుకొచ్చేదీ స్పష్టత లేదు.

ఇవీ చదవండి..
వాట్సాప్‌ టు టెలిగ్రాం..చాట్ హిస్టరీ మార్చేయండిలా!
ఆండ్రాయిడ్ 12 ఇలానే ఉంటుందా..! 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న