నోటీస్‌బోర్డు

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ కం టీఆర్టీ-2014లో మిగిలిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల(ఉర్దూ) ఖాళీలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిలో మొత్తం 211 ఖాళీలను ప్రకటించింది. ....

Published : 08 Aug 2018 02:05 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
211 ఉర్దూ టీచర్‌ పోస్టులు  

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ కం టీఆర్టీ-2014లో మిగిలిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల(ఉర్దూ) ఖాళీలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిలో మొత్తం 211 ఖాళీలను ప్రకటించింది. 
అర్హత: ఇంటర్‌, డీఈడీ, ఏపీ టెట్‌ ఉత్తీర్ణత. ఉర్దూ మాధ్యమం/ ఉర్దూ ప్రథమ భాషగా పదోతరగతి, ఉర్దూ మాధ్యమం/ ఉర్దూను భాషగా ఇంటర్‌ లేదా డిగ్రీ చదివి ఉండాలి. 
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష, టెట్‌ స్కోరు ఆధారంగా. 
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరితేది: ఆగస్టు 13. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ చివరితేది: ఆగస్టు 14. స్వీయ ధ్రువీకరణతో అర్హత ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు డీఈవోలకు సమర్పణ: ఆగస్టు 25నుంచి 30 వరకు 
రాతపరీక్ష తేది: సెప్టెంబరు 16.
వెబ్‌సైట్‌:https://aptrt.apcfss.in/

సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌

  రాంచీ(ఝార్ఖండ్‌)లోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: మైనింగ్‌ సిర్దార్‌- 269, ఎల‌్రక్టీషియన్‌/టెక్నీషియన్‌- 211. మొత్తం ఖాళీలు: 480.
అర్హత: ఎంఎస్‌ ఖాళీలకు మైనింగ్‌ సిర్దార్‌, గ్యాస్‌ టెస్టింగ్‌, ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్లు ఉండాలి. ఈ/టీ పోస్టులకు మెట్రిక్యులేషన్‌, ఐటీఐ(ఎల‌్రక్టీషియన్‌), అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌తో పాటు ఇతర నిబంధనలు. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత, వైద్య పరీక్షల ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: 10.08.2018 నుంచి 10.09.2018 వరకు.
హార్డుకాపీలు పంపేందుకు చివరితేది: 20.09.2018.
వెబ్‌సైట్‌: ‌www.centralcoalfields.in

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌  

హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికపై ఫార్మసిస్ట్‌/ అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అర్హత: డీఫార్మసీ/ బీఫార్మసీ ఉత్తీర్ణత. వయసు: 37 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఇంటర్వ్యూ తేది: 09.08.2018.
వేదిక: హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌, ప్లాట్‌నెం.30, గాంధీనగర్‌, హైదరాబాద్‌. www.lifecarehll.com

వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తాత్కాలిక పోస్టులు

ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో...
పోస్టు-ఖాళీలు: టీచింగ్‌ అసోసియేట్‌- 2, టీచింగ్‌ అసిస్టెంట్‌- 1.
అర్హత: బీఎస్సీ/ ఎంఎస్సీ (అగ్రి) ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేది: 27.08.2018.
వేదిక: అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌, చింతపల్లి, విశాఖపట్నం జిల్లా.
వెబ్‌సైట్‌:www.angrau.ac.in

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీలో...

పోస్టు-ఖాళీలు: ఎస్‌ఆర్‌ఎఫ్‌- 1, డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 1.
అర్హత: సబంధిత విభాగంలో డిప్లొమా, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేది: 09.08.2018.
వేదిక: వాటర్‌ టెక్నాలజీ సెంటర్‌, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: www.pjtsau.ac.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసంwww.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని