వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..

తమ వెబ్‌సైట్‌లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మైట్రిప్‌ వెల్లడించింది.

Published : 09 May 2024 00:07 IST

దిల్లీ: వేసవి అంటే వెంటనే గుర్తుకొచ్చేది విహారమే. దాదాపుగా ప్రతీఒక్కరూ కుటుంబంతో కలసి అలా టూర్‌ వెళ్లి రావాలనుకుంటారు. దానికోసం ఏ ప్రాంతం వెళ్తే బాగుంటుందని సెర్చ్‌ చేస్తారు. ఇలా తమ వెబ్‌సైట్‌లో శోధించిన వాటిలో అయోధ్య (Ayodhya), లక్షద్వీప్‌ (Lakshadweep), నందీహిల్స్‌ (Nandi Hills) ముందు వరుసలో నిలిచాయని ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ (MakeMyTrip) వెల్లడించింది. గోవాను కూడా ఎక్కువమంది సెర్చ్‌ చేశారని పేర్కొంది. మార్చి- ఏప్రిల్‌ 2024 డేటా ఆధారంగా రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేసింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు

మేక్‌మైట్రిప్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. పూరీ, వారణాసి ఎక్కువమంది సెర్చ్‌ చేసిన తీర్థయాత్రల జాబితాలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణాల విషయానికొస్తే.. బాకు, అల్మాటీ, నగోయా ప్రాంతాలను ఎక్కువమంది శోధించారట. వీటితో పాటు లక్సెంబర్గ్‌, లంకావి, అంటల్యా కూడా ఉన్నాయి. 2023 వేసవితో పోలిస్తే ఫ్యామిలీ ట్రావెల్‌ విభాగం 20 శాతం పెరిగితే, సోలో ట్రావెల్‌ 10 శాతం వృద్ధి చెందిందని మేక్‌మై ట్రిప్‌ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ వేసవిలో శోధనలు పెరిగాయని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజేష్‌ మాగో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని