విద్వాన్ డిగ్రీకి స‌మాన‌మా?

హిందీ పండిట్‌ విద్వాన్‌ చేసి, హెచ్‌పీటీ శిక్షణ పూర్తిచేశాను. విద్వాన్‌ను డిగ్రీతో సమానంగా భావించటం నిజమేనా? అయితే నేను బీఈడీ చేసే అవకాశముందా?

Published : 15 Jan 2016 17:12 IST

 విద్వాన్ డిగ్రీకి స‌మాన‌మా?

 

హిందీ పండిట్‌ విద్వాన్‌ చేసి, హెచ్‌పీటీ శిక్షణ పూర్తిచేశాను. విద్వాన్‌ను డిగ్రీతో సమానంగా భావించటం నిజమేనా? అయితే నేను బీఈడీ చేసే అవకాశముందా? వేరే రాష్ట్రంలో డీఈడీ చేస్తే ఆ విద్యార్థి లోకల్‌ అవుతాడా? నాన్‌ లోకల్‌ అవుతాడా?                                      - పి. రఘునందన్‌                      

 
సాధారణంగా మీరు చేసిన హిందీ పండిట్‌ విద్వాన్‌ డిగ్రీతో సమానం కాదు. కానీ మీరు చేసిన హెచ్‌పీటీ శిక్షణ హిందీ ప్రచార్‌ సభ (నాంపల్లి, హైదరాబాద్‌) వారి ఆమోదం పొందినట్లైతే అది డిగ్రీతో సమానమనే జీవో ఉంది. ఆ జీవో కాపీ కావాలనుకుంటే మీరు హిందీ ప్రచార్‌ సభకు వెళ్లి సంప్రదించండి. ఒకవేళ అది డిగ్రీతో సమానమైతే మీరు బీఈడీ చేయడానికి అవకాశముంటుంది. లేదంటే ఉండదు. ఎందుకంటే బీఈడీ చేయాలంటే డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మీరు లోకలా, నాన్‌లోకలా అనేది మీరు చదివిన డిగ్రీపై ఆధారపడి ఉండదు. రెండు, మూడు సంవత్సరాలు ఇతర రాష్ట్రాల్లో చేసినంత మాత్రాన నాన్‌లోకల్‌ కారు. నాలుగో తరగతి నుంచి పదోతరగతి వరకు ఎక్కడ చదువుకున్నారో ఆ ప్రాంతం మీకు లోకల్‌ అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని