ఉద్యోగాధారిత కోర్సులు ఏమున్నాయ్‌?

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. కోర్‌ విభాగంలోని షార్ట్‌టైం కోర్సుల వివరాలు తెలపండి. ఉద్యోగాధారిత కోర్సులు, శిక్షణ సంస్థల వివరాలనూ తెలపండి.

Published : 17 Oct 2016 01:10 IST

ఉద్యోగాధారిత కోర్సులు ఏమున్నాయ్‌?

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. కోర్‌ విభాగంలోని షార్ట్‌టైం కోర్సుల వివరాలు తెలపండి. ఉద్యోగాధారిత కోర్సులు, శిక్షణ సంస్థల వివరాలనూ తెలపండి.

- రాజశేఖర్‌, వనపర్తి

జ: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌తో ఉద్యోగం సంపాదించడం అంత కష్టమేమీ కాదు. మొదట మీరు ఏ రంగంలోకి వెళ్లదలచుకున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ రెండు రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు చేయడానికి మీరు అర్హులు. కాబట్టి మీకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

* కోర్‌ విభాగంలో ఆసక్తి ఉంటే పవర్‌ సిస్టమ్స్‌, సోలార్‌ పానెల్స్‌ల తాజా అనువర్తనాలు వంటి వాటికి సంబంధించిన కోర్సులు చేయవచ్చు.

* ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అయితే ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వెరిలార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) లాంటి కోర్సులు చదవడానికి కూడా అవకాశముంది. వీటితోపాటు ఉద్యోగాధారిత స్వల్పకాలిక కోర్సులు- రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, నానో టెక్నాలజీ వర్క్‌షాప్‌, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, లీనియర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, అడ్వాన్స్‌డ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్‌ అనాలిసిస్‌, స్విచ్‌గేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ మొదలైన కోర్సులు చదవవచ్చు.

ఇతర డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ కోర్సులను ఎక్కువగా ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. అతి తక్కువ ప్రభుత్వ విద్యాసంస్థలు స్వల్పకాలిక ఉద్యోగాధారిత కోర్సులను అందిస్తున్నాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని