పీహెచ్‌డీకి అవకాశముందా?

ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్‌ను 51% మార్కులతో పూర్తిచేశాను. ఉస్మానియా, ఇతర ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి అర్హత ఉండదని తెలుసు. పీహెచ్‌డీ చేయడానికి అవకాశమిచ్చే ఇతర విశ్వవిద్యాలయాల గురించి తెలపండి.

Published : 19 Jun 2017 02:09 IST

పీహెచ్‌డీకి అవకాశముందా?

* ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్‌ను 51% మార్కులతో పూర్తిచేశాను. ఉస్మానియా, ఇతర ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి అర్హత ఉండదని తెలుసు. పీహెచ్‌డీ చేయడానికి అవకాశమిచ్చే ఇతర విశ్వవిద్యాలయాల గురించి తెలపండి. ఇంకా దూరవిద్యలో ఇతర అవకాశాలు నాకు ఏమేం ఉన్నాయో తెలపండి.

- డి. శివరంజని

* ఏదైనా విశ్వవిద్యాలంలో పీహెచ్‌డీ లేదా ఎంఫిల్‌ అభ్యసించడానికి తత్సమాన పీజీలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్ష, ముఖాముఖి ద్వారా ప్రవేశం కల్పిస్తారు. యూజీసీ 2016 రెగ్యులేషన్స్‌ ప్రకారం దూరవిద్య ద్వారా ఏ విశ్వవిద్యాలయం కూడా దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ అందించకూడదు.

మీరు ఇతర దూరవిద్య కోర్సులు అందిస్తున్న ఇగ్నో, ఇఫ్లూ, ఉస్మానియా, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు అందిస్తున్న ఆరు నెలల ఇంగ్లిష్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు, ఏడాది వ్యవధిగల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌/ డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ వంటి దూరవిద్య కోర్సులను ఎంచుకుని మీ అర్హతలు, ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవచ్చు.

ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని