పైౖథాన్‌కు గిరాకీ ఉందా?

పైౖథాన్‌ అనేది వివిధ రకాల అనువర్తనాలకు వాడుతున్న కంప్యూటర్‌ లాంగ్వేజ్‌. బిగ్‌ డేటా విప్లవంతో పైథాన్‌ డెవలపర్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. పైథాన్‌ లాంగ్వేజీతోపాటు డేటా మైనింగ్‌, డేటా అనలిటిక్స్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌లో అవగాహన,...

Published : 18 Sep 2017 02:17 IST

పైౖథాన్‌కు గిరాకీ ఉందా?

బీటెక్‌ చేశాను. ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం ఉంది. పైౖథాన్‌ డెవలపర్‌ కావాలనుంది. అందుకున్న మార్గాలేంటి? పై¶థాన్‌ డెవలపర్‌కు గిరాకీ ఉందా? - మాధురి
* * పైౖథాన్‌ అనేది వివిధ రకాల అనువర్తనాలకు వాడుతున్న కంప్యూటర్‌ లాంగ్వేజ్‌. బిగ్‌ డేటా విప్లవంతో పైథాన్‌ డెవలపర్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. పైథాన్‌ లాంగ్వేజీతోపాటు డేటా మైనింగ్‌, డేటా అనలిటిక్స్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌లో అవగాహన, దీనిపై పట్టు సాధిస్తే డేటా సైంటిస్ట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, పైథాన్‌ డెవలపర్‌ వంటి ఉద్యోగావకాశాలనూ పొందవచ్చు.

ఇంటీరియర్‌ డిజైన్‌, యానిమేషన్‌లలో ఆసక్తి ఉంది. వీటికున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలను తెలియజేయండి. - శ్రీనివాస్‌
* * మీ విద్యార్హతను తెలియజేయలేదు. కళాత్మక నైపుణ్యాలు, కళల పట్ల అభిరుచి, కొత్తదనం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు యానిమేషన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ రంగాల్లో రాణించవచ్చు. మీరు ఇంజినీరింగ్‌ (సివిల్‌/ ఆర్కిటెక్చర్‌) డిగ్రీ పట్టా కలిగి ఉంటే వివిధ ప్రభుత్వరంగ కన్‌స్ట్రక్షన్‌ విభాగాల్లో ఉద్యోగం పొందవచ్చు. ప్రైవేటు రంగాల్లో ఇంటీరియర్‌ డిజైనర్‌, డిజైన్‌ డెవలపర్‌ వంటి సృజనాత్మక ఉద్యోగాలను పొందవచ్చు. యానిమేషన్‌ రంగం పూర్తిగా కంప్యూటర్‌తో సమ్మిళితమైనది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌, గేమింగ్‌, లోగో డెవలపింగ్‌ ఆర్టిస్ట్‌ వంటి విభాగాల్లో అవకాశాలను సంపాదించుకోవచ్చు.

పదో తరగతి చదువుతున్నాను.ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌పై ఆసక్తి ఉంది. అందుకు ఏయే కోర్సులను ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి? - దివ్యశ్రీ
* * పర్యావరణంపై మీకున్న ఆసక్తి అభినందనీయం. 10+2లో ఎంపీసీ లేదా బైపీసీ చదివినవారు ఈ కోర్సును చేయడానికి అర్హులు. మీరు బీఎస్‌సీ- ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా బీటెక్‌- ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలైన ఐఐటీ దిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ రూర్కీ, ఎన్‌ఐటీలు ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. భారతీ విద్యాపీఠ్‌ యూనివర్సిటీ, సీఎంజే యూనివర్సిటీలతోపాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్‌ అమీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ, శ్రీ గ్రంథి చిన సన్యాసిరాజు కళాశాల వారు బీఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ డిగ్రీ కోర్సును అందిస్తున్నారు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని