ఎంసెట్‌, జేఈఈ లేకుండా బీటెక్‌ చేయవచ్చా?

ఎంసెట్‌ కానీ, జేఈఈకానీ రాయకుండా బీటెక్‌లో ప్రవేశం పొందడం సాధ్యమే. సదరు విశ్వవిద్యాలయంవారు...

Published : 30 Jan 2018 01:41 IST

ఎంసెట్‌, జేఈఈ లేకుండా బీటెక్‌ చేయవచ్చా?

ఎంసెట్‌గానీ, జేఈఈగానీ రాయకుండా బీటెక్‌ చదవడం సాధ్యమేనా?

- శిరీష, తిమ్మసముద్రం  

జ: ఎంసెట్‌ కానీ, జేఈఈకానీ రాయకుండా బీటెక్‌లో ప్రవేశం పొందడం సాధ్యమే. సదరు విశ్వవిద్యాలయంవారు నిర్వహించే వారి సొంత ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఉదాహరణకు- వీఐటీ విశ్వవిద్యాలయం వీఐటీఈఈఈ (వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) ద్వారా, గీతం విశ్వవిద్యాలయం జీఏటీ (గీతం అడ్మిషన్‌ టెస్ట్‌), ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఎస్‌ఆర్‌ఎం జేఈఈ ద్వారా బీటెక్‌ కోర్సుల్లోకి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఇవేకాకుండా కళాశాలలకు కేటాయించిన మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల ద్వారా కూడా బీటెక్‌లోకి ప్రవేశాన్ని పొంది, తమ విద్యను కొనసాగించవచ్చు.

-ప్రొ.బి.రాజ‌శేఖ‌ర్‌, కెరియ‌ర్ కౌన్సెల‌ర్  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని