రక్షణ రంగంలో అమ్మాయిలకు అవకాశాలు?

ఇంటర్‌ పూర్తిచేశాను. నాకు రక్షణ రంగంవైపు వెళ్లాలని ఉంది. అమ్మాయిలకు ఈ రంగంలో ఉన్న అవకాశాలూ, అందించే కళాశాలలు, ప్రవేశపరీక్షల వివరాలను తెలియజేయండి.

Published : 26 Jun 2018 02:19 IST

రక్షణ రంగంలో అమ్మాయిలకు అవకాశాలు?

* ఇంటర్‌ పూర్తిచేశాను. నాకు రక్షణ రంగంవైపు వెళ్లాలని ఉంది. అమ్మాయిలకు ఈ రంగంలో ఉన్న అవకాశాలూ, అందించే కళాశాలలు, ప్రవేశపరీక్షల వివరాలను తెలియజేయండి.

- పి.దిషిత

క్షణ రంగంలో అడుగిడాలనుకునేవారు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఏటా రెండుసార్లు యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో గమనించాల్సిన విషయం- అభ్యర్థి వయసు 16-19 ఏళ్ల మధ్య ఉండాలి. అంతకుమించినవారు అనర్హులు. ఆర్మీ విభాగంలో చేరాలంటే ఏదైనా సబ్జెక్టులో 10+2 పూర్తి చేసుండాలి. నేవీ లేదా ఏర్‌ఫోర్స్‌ విభాగంలో అభ్యర్థులు 10+2లో మేథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తారు. డిగ్రీ పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌- టెక్నికల్‌ ఉమెన్‌ పరీక్ష ద్వారా రక్షణ రంగంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. పట్టుదల, కార్యదక్షతతో ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని