ఫార్మసీ తర్వాత ఏ కోర్సులు మేలు?

ఫార్మా కళాశాలలు భారీగా పెరగడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల బీ ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు తగ్గాయనేది కొంత అపోహే.ఫార్మా రంగం అభివృద్ధి....

Published : 25 Jul 2018 01:37 IST

ఫార్మసీ తర్వాత ఏ కోర్సులు మేలు?

బీ- ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్నాను. తర్వాత ఏ కోర్సులు ఎంచుకుంటే మేలు? మెడికల్‌ కోడింగ్‌, ఫార్మకో విజిలెన్స్‌, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌లలో వేటికి భవిష్యత్తు ఉంది?

- కరిష్మా

ఫార్మా కళాశాలలు భారీగా పెరగడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల బీ ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు తగ్గాయనేది కొంత అపోహే.ఫార్మా రంగం అభివృద్ధి, బహుళ జాతి సంస్థలు భారతదేశానికి రావడం ఫార్మా విద్యార్థులకు శుభ పరిణామం. వీటి వల్ల రీసెర్చ్‌ ఓరియంటెడ్‌గా విద్యను అభ్యసిస్తే ఉద్యోగాలు మంచి జీతంతో అందిపుచ్చుకోవచ్చు. బీ ఫార్మసీ పూర్తిచేసిన తర్వాత జీపీఏటీ (జీప్యాట్‌) ద్వారా పీజీ (ఎం.ఫార్మసీ) లేదా నైపర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వంటి సంస్థల్లో ఎంబీఏ (హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సును పూర్తి చేసి మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

* మెడికల్‌ కోడింగ్‌ విషయానికొస్తే అభ్యర్థులు ఏఏపీసీ వారు నిర్వహించే సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ కోడర్‌(సీపీసీ) సర్టిఫైడ్‌ అవుట్‌ పేషెంట్‌ కోడర్‌ (సీఓసీ), సీఆర్‌సీ, సీఐసీ, మెడికల్‌ డాక్యుమెంటేషన్‌ లాంటి కోర్సులు చేయడం ద్వారా మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉద్యోగాన్ని సాధించవచ్చు. స్థిరపర్చుకోవచ్చు.
* ఔషధాల ప్రభావాలను పర్యవేక్షించి వాటి ప్రతికూల చర్యలను ముందుగానే అంచనా వేయడానికి, గుర్తించడానికి ఉపయోగపడే శాస్త్రమే ఫార్మకో-విజిలెన్స్‌. పేషెంట్‌ క్షేమం, ఆపరేషన్స్‌, సర్‌వైలెన్స్‌, సిస్టమ్స్‌, ఎస్‌ఓపీ ప్రిపరేషన్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాన్ని సంపాదించవచ్చు.
* మెడికల్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ కోర్సును కూడా ఉద్యోగం కోసం ఎంచుకోవచ్చు. పై కోర్సులపై కొన్ని ప్రైవేట్‌ సంస్థలు హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో శిక్షణ అందిస్తున్నాయి.

- ప్రొ. బి.రాజశేఖర్‌,  కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని