మెదడు మీదా నొప్పి భారం

ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులతో చాలామంది దీర్ఘకాలంగా బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇవి శారీరకంగా అసౌకర్యం కలిగించటమే కాదు

Published : 11 Jun 2024 00:16 IST

ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులతో చాలామంది దీర్ఘకాలంగా బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇవి శారీరకంగా అసౌకర్యం కలిగించటమే కాదు, మెదడుకు త్వరగా వృద్ధాప్యం ముంచుకొచ్చేలా చేస్తున్నట్టూ తాజాగా బయటపడింది. దీర్ఘకాల నొప్పితో బాధపడేవారి మెదడును పరిశోధకులు ఎంఆర్‌ఐ స్కాన్‌ చిత్రాలతో పరిశీలించి, శారీరక వయసుతో పోల్చి చూశారు. ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే వీరి మెదడు ఎక్కువ వేగంగా వృద్ధాప్యంలోకి జారుకుంటున్నట్టు తేలింది. రోజువారీ పనులు చేసుకోలేకపోవటానికి, వైకల్యానికి ప్రధాన కారణం దీర్ఘకాల నొప్పులే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40% మంది ఇలాంటి నొప్పులతో బాధపడుతున్నారని అంచనా. ఇవి మెదడును దెబ్బతీయటం ద్వారా విషయగ్రహణ సామర్థ్యాన్నీ తగ్గిస్తున్నాయి. ఇదెలా జరుగుతుందో కచ్చితంగా తెలియరాలేదు గానీ మెదడు వయసుతో ముడిపడిన జీవసూచికలు దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారిలో ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మెదడు వయసుకూ నొప్పులకూ సంబంధం ఉంటున్నట్టు ఇది సూచిస్తోంది. మున్ముందు జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం గలవారిని, మతిమరుపు ముప్పు ఎక్కువగా ఉన్నవారిని గుర్తించటానికి ఈ మెదడు వయసు జీవసూచికలు ఉపయోగపడగలవని పరిశోధకులు చెబుతున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని