చిన్న వయసు ‘తృప్తి’!

‘వయసెంత?’ అని అడిగితే చాలామంది ఒకట్రెండు సంవత్సరాలు తక్కువగానే చెబుతుంటారు. తమకింకా వయసు మీద పడలేదని, వృద్ధాప్యం ముంచుకురాలేదని చెప్పటం దీని ఉద్దేశం కావొచ్చు. కానీ ఆశ్చర్యమేంటంటే ఇలాంటి భావన శృంగారంపైనా ప్రభావం చూపుతుండటం!

Published : 04 Jul 2017 01:44 IST

చిన్న వయసు ‘తృప్తి’!

‘వయసెంత?’ అని అడిగితే చాలామంది ఒకట్రెండు సంవత్సరాలు తక్కువగానే చెబుతుంటారు. తమకింకా వయసు మీద పడలేదని, వృద్ధాప్యం ముంచుకురాలేదని చెప్పటం దీని ఉద్దేశం కావొచ్చు. కానీ ఆశ్చర్యమేంటంటే ఇలాంటి భావన శృంగారంపైనా ప్రభావం చూపుతుండటం! శృంగారంలో తృప్తిని పొందామనే భావనకు ఈ ‘మానసిక వయసు’ కూడా కీలకంగా పనిచేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంది మరి. వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల 40-60 ఏళ్ల వయసువారిలో శృంగార ధోరణులపై ఒక అధ్యయనం చేసి మరీ దీన్ని గుర్తించారు. అసలు వయసుతో పోలిస్తే మానసికంగా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని మరింత బాగా ఆస్వాదిస్తున్నట్టు తేల్చారు. అంటే దీనర్థం ఇలాంటివాళ్లు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నారని కాదు. శృంగారానుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారనే. వయసుతో పాటు వచ్చే దీర్ఘకాల సమస్యలను పరిగణనలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదిస్తుండటం విశేషం. వయసు తక్కువని భావించేవారు సహజంగానే చురుకుగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివీ వీరిలో ఎక్కువే. ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగటానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించటానికి పురికొల్పుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని