ఆ హోటల్‌కి వెళతారా? మరి గుండె ధైర్యం ఉందా?

అదో హోటల్...మరి ప్రత్యేకతేంటో తెలుసా?ప్రపంచంలోనే భయంకరమైనది...ఎందుకంటే కొండ అంచున ఉంటుంది...మరి ఆ విశేషాలు తెలుసుకుందామా?

Published : 17 Jan 2016 10:57 IST

ఆ హోటల్‌కి వెళతారా? మరి గుండె ధైర్యం ఉందా?

అదో హోటల్‌...మరి ప్రత్యేకతేంటో తెలుసా?ప్రపంచంలోనే భయంకరమైనది...ఎందుకంటే కొండ అంచున ఉంటుంది...మరి ఆ విశేషాలు తెలుసుకుందామా?
   హోటల్‌కు వెళ్లాలంటే గొప్ప సాహసులై ఉండాలి. అక్కడ ఉండాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవాలి.

* ఈ హోటల్‌ పేరు ఖస్కై లాడ్జ్‌’. ఉన్నది పెరూలోని కుస్కో నగరం దగ్గరి సాక్రెడ్‌ వ్యాలీలోని ఆండీస్‌ పర్వతాలపై.

* ప్రపంచంలోనే అతి భయంకరమైన హోటల్‌గా దీన్ని చెబుతారు. ఎందుకంటే నేలపై నుంచి 1312 అడుగుల ఎత్తులో కొండ అంచుకు వేలాడేసి మూడు గదులు ఉంటాయిక్కడ. ఈ మూడింటిని కలిపే ఖస్కై లాడ్జ్‌ హోటల్‌’ అని పిలుస్తారు. ఒక్కో గదికి చుట్టూ గాజు అద్దాలతో పారదర్శకంగా ఉంటుంది. అంటే మనం లోపల కూర్చుంటే బయటి పరిసరాలన్నీ కనిపిస్తాయి. అయితే ఇది చేసింది మాత్రం గాజుతో కాదు, పాలీకార్బొనేట్‌ అనే పదార్థంతో. 24 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ గదులు అల్యూమినియం ఫ్రేమ్‌తో కొండకు బిగించి ఉంటాయి. ఒక్కోదాంట్లో ఎనిమిది మంది సరిపోతారంతే.

* మరి ఈ గదులకు ఎలా వెళ్లాలో తెలుసా? కింద నుంచి మెట్లతో ఏర్పాటుచేసిన 400 అడుగుల ఒక నిచ్చెన ఉంటుంది. అది ఎక్కాక కొండలపై ఉన్న దారిగుండా ఈ గదులను చేరుకోవచ్చు. అంత పైకి ఎక్కలేమనుకుంటే కొండల నడుమ జర్రున జారిపోయే ఖజిప్‌ వైర్‌’ రైడ్‌ తెలుసుగా. దాని సాయంతో వెళ్లొచ్చు. అందుకే ఇక్కడికి సాహసికులు మాత్రమే వస్తుంటారు.

* ఈ గదులనుంచి చూస్తే చుట్టూ కొండకోనలు, నదులు, భలే అందంగా కనిపిస్తాయి. కిందున్న ఇళ్లు అగ్గిపెట్టెల్లా ఉంటే, మనుషులు చీమల్లా చాలా చిన్నగా కనిపిస్తారు. ఈ హోటల్‌ గదుల్లో సకల సౌకర్యాలూ ఉంటాయి. ఇక్కడ తినడానికి ఆహార పదార్థాలను నిర్వాహకులు ఏర్పాటుచేసి పెడతారు. ఇందులో స్నానాల గదితోపాటు పడక గది, కుర్చీలు, టీవీ అన్నీ ఉంటాయి. సౌర విద్యుత్‌తో ఇవి నడుస్తాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు