భార్యాభర్తలే... అయ్యారు రాతి గుమ్మటాలు!

ఆ రాతి గుమ్మటాన్ని చూస్తేనే కళ్లు తిరుగుతాయి... వేలాది అడుగుల ఎత్తులో ఉంటుంది... మరి దానిపై ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి... ఇంతకీ ఎక్కడుంది? ఏమా సంగతులు?

Published : 17 Jan 2016 11:09 IST

భార్యాభర్తలే... అయ్యారు రాతి గుమ్మటాలు!

ఆ రాతి గుమ్మటాన్ని చూస్తేనే కళ్లు తిరుగుతాయి... వేలాది అడుగుల ఎత్తులో ఉంటుంది... మరి దానిపై ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి... ఇంతకీ ఎక్కడుంది? ఏమా సంగతులు?

  నగనగా ఓ కొత్త జంట. కొన్నాళ్లు బాగానే ఉంటారు. ఓసారి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. భార్య పేరు టెసైయాక్‌. ఆమెను భర్త కోపంతో తరుముతాడు. ఆమె బాధతో తన దగ్గరున్న పండ్ల బుట్టను భర్తపై విసిరేస్తుంది. ఇదంతా గమనిస్తున్న దేవుడికి కోపం వచ్చి వాళ్లను బండరాళ్లుగా మార్చేస్తాడు. అప్పుడు భార్యాభర్తలతో సహా పండ్ల బుట్ట కూడా బండరాయిగా మారుతుంది. ఇదంతా పెద్ద రాతి గుమ్మటాల వెనుకున్న ఆసక్తికరమైన కథ.

* అమెరికా కాలిఫోర్నియాలోని యోసమైట్‌ నేషనల్‌ పార్కులో ఉన్న గుమ్మటాల కథే ఇది. ఇందులో భర్త నార్త్‌ డోమ్‌గా, పండ్ల బుట్ట బాస్కెట్‌ డోమ్‌గా, భార్య హాఫ్‌ డోమ్‌గా మారారట. భార్య టెసైయాక్‌ బండరాయిని గమనిస్తే దీనిపై కన్నీటి గుర్తులు కనిపిస్తాయట.
* కథ సంగతెలా ఉన్నా ఈ హాఫ్‌డోమ్‌ మాత్రం పర్వతారోహకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రాతి గుమ్మటాల్లో ప్రత్యేకమైంది కూడా హాఫ్‌డోమే. దాదాపు ఐదువేల అడుగుల ఎత్తుండే దీనిపైకి సాహసికులు ఎక్కేస్తుంటారు.

 * పూర్తిగా గ్రానైట్‌ రాయితో ఏర్పడిన ఈ హాఫ్‌డోమ్‌ రూపాన్ని బట్టి ఆ పేరు పెట్టారు. చీలినట్టు ఉండటం వల్ల దీన్ని ఖక్లెఫ్ట్‌ రాక్‌’ అని కూడా పిలుస్తారు.
* దూరం నుంచి చూస్తేనే గుండెలో దడ పుడుతుంది. దీన్ని అధిరోహించడం ఎంతో శిక్షణ ఉన్న పర్వతారోహకులకే సాధ్యం. అందుకే ఈ కొండపైకి ఎక్కడానికి పెద్ద పెద్ద స్టీలు రాడ్లనుపయోగించి రెండు దృఢమైన కేబుళ్లు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో పైకి చేరుకోవచ్చన్నమాట. శిఖరాగ్రం పైన తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పరిసరాల్ని తట్టుకునేలా, నునుపు రాయిపై జారకుండా ఉండటానికి యాత్రికులు సరైన జాగ్రత్తలు తీసుకుని వెళతారు.

  * పైకెక్కి మళ్లీ దిగడానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతుంది.
* పైకెక్కుతుంటే జలపాతాలు, పచ్చని చెట్లు కనువిందుచేస్తాయి. ఆ తర్వాత వాటిని దాటుతూ పైకి వెళ్లాక కేబుల్‌ మార్గం వస్తుంది. దానిగుండా హాఫ్‌డోమ్‌ రాతి గుమ్మటాన్ని ఎక్కేయొచ్చన్నమాట.

 * పేద్ద కొండపై సన్నని కేబుల్‌ మార్గంలో సాహసికులు నడుస్తుంటే అదాటున చీమలదండులా భలేగా కనిపిస్తారు.
* వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు రోజుకు వెయ్యి మందిదాకా ఈ గుమ్మటం ఎక్కేస్తుంటారు.
* మొదటి సారిగా 1875లోనే జార్జ్‌ అండెర్‌సన్‌ అనే ఆయన ఈ రాతి గుమ్మటం ఎక్కి శిఖారాగ్రానికి చేరుకున్నాడు. ఆ తర్వాత 1919లో కేబుల్‌ మార్గాన్ని ఏర్పాటు చేశాక పర్యటకులు ఈ హాఫ్‌డోమ్‌ను పెద్ద సంఖ్యలో అధిరోహిస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని