Anti Israel Protests: అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్‌

Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. 

Published : 26 Apr 2024 13:17 IST

వాషింగ్టన్‌: గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా జో బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా (USA) విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీస్థాయిలో ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటుచేసుకున్న నిరసనల్లో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో భారత సంతతికి చెందిన విద్యార్థిని ఉన్నారు. (Anti-Israel Protests)

తమిళనాడుకు చెందిన ఆమె పేరు అచింత్య శివలింగన్‌. ప్రిన్స్‌టన్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. అరెస్టయిన మరో విద్యార్థి పేరు హస్సన్ సయ్యద్‌. నిరసనకారులు గురువారం తెల్లవారుజామున క్యాంపస్‌లో టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి అరెస్టు చోటుచేసుకుందని విద్యార్థి సంఘాల పత్రికల్లో పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. యూనివర్సిటీ పాలసీని ఉల్లంఘిస్తూ టెంట్లు ఏర్పాటు చేసినందున చర్యలు తీసుకున్నట్లు విద్యా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో మొదలైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలకు వ్యాపించాయి. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని