Yodha: ఓటీటీలోకి యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..

సిద్ధార్థ్‌ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 26 Apr 2024 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ కథా నాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యోధ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మెప్పించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ఇది అందుబాటులోకి వచ్చింది. మే 10 తర్వాత ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓఝా సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించారు.

క‌థేంటంటే: త‌న తండ్రి సురేంద్ర క‌టియాల్ (రోనిత్ రాయ్‌) స్ఫూర్తితో యోధా టాస్క్‌ఫోర్స్‌లో క‌మాండోగా చేర‌తాడు అరుణ్ క‌టియాల్ (సిద్ధార్థ్ మ‌ల్హోత్రా). దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆప‌రేష‌న్స్‌లో పాల్గొన‌డం అతడి శైలి. ఆ క్ర‌మంలో కొన్నిసార్లు నిబంధ‌న‌ల్ని కూడా అతిక్ర‌మిస్తుంటాడు. ఆయ‌న భార్య ప్రియంవ‌ద క‌టియాల్ (రాశీఖ‌న్నా) కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్నతోద్యోగి. అరుణ్ చేప‌ట్టిన ఓ ఆప‌రేష‌న్ ఫెయిల్ కావ‌డంతో ప్రముఖ శాస్త్ర‌వేత్త అయిన అనుజ్ నాయ‌ర్ ప్ర‌యాణిస్తున్న విమానం హైజాక్‌కు గురికావ‌డంతో, ఉగ్ర‌వాదుల చేతుల్లో ఆయ‌న దారుణ హ‌త్య‌కు గుర‌వుతాడు. అదంతా స‌మ‌న్వ‌యలోపంతో జ‌రిగింద‌ని, అరుణ్‌ త‌న వాద‌న‌ వినిపిస్తాడు. ఆ ఆపరేషన్‌ ప్రభావం అరుణ్‌, ప్రియంవ‌ద వైవాహిక జీవితంపై పడుతుంది. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత యోధ టాస్క్‌ఫోర్స్ భ‌విత‌వ్యమే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. ఆ తర్వాత ఉగ్రవాదుల కుట్ర‌ల‌ను అతడు ఎలా తిప్పికొట్టాడ‌నేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని