Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Apr 2024 12:59 IST

1. జగన్‌ ఏ స్థాయికి దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలి: బీటెక్‌ రవి

రాష్ట్రంలో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెదేపా నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఆయన ఊదరగొడుతున్నారన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా నేత శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. పూర్తి కథనం

2. విజయ్‌ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్‌ విజ్ఞప్తి

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా(Vijay Mallya)పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఐరోపాలో అతడి కదలికలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ నెల మొదట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్‌-ఫ్రాన్స్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.పూర్తి కథనం

3. వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి కథనం

4. 100% వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈవీఎం-వీవీప్యాట్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.పూర్తి కథనం

5. ఆసుపత్రి నుంచి వచ్చి.. ఓటేసిన నారాయణమూర్తి

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) రెండో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన సతీమణి సుధామూర్తి (Sudha Murty) బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనకు ఈ ఓటు హక్కు వస్తుంది. ఎంతో విశ్లేషణ తర్వాత ఈ హక్కును వినియోగించుకోవాలి. ఎవరూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’’ అని నారాయణ మూర్తి ఓటర్లకు సూచించారు.పూర్తి కథనం

6. లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌..?

ఏడాది క్రితం పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చి కలకలం రేపిన ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) ఇప్పుడు ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఖదూర్‌ సాహెబ్‌ లోక్‌ సభ స్థానం నుంచి బరిలోకి దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. అమృత్‌పాల్‌  ప్రస్తుతం డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నాహలు చేసుకుంటున్నట్లు అతడి లాయర్‌ రాజ్‌దేవ్‌ సింగ్‌ ఖల్సా బుధవారం ప్రకటించారు.పూర్తి కథనం

7. అమరుల వీరుల స్తూపం వద్దకు వచ్చా.. రేవంత్‌ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: హరీశ్‌రావు

హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండు పేపర్లు, సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు.పూర్తి కథనం

8. ఐదు సంక్రాంతులొచ్చాయి.. జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ?: వైఎస్‌ షర్మిల

ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్‌కు తెలియదా? అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా? ఐదేళ్లయింది దాని ఊసే లేదు. మన బిడ్డల భవిష్యత్తుపై జగన్‌ ఆలోచించట్లేదు. మూడు రాజధానులన్నారు.. ఒక్కటీ లేకుండా చేశారు.పూర్తి కథనం

9. 17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే!

సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్‌ కార్డులు ప్రభావితమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) గురువారం అంగీకరించింది. ఈ కార్డులు డిజిటల్‌ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది.పూర్తి కథనం

10. అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్‌

వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరుకు ఎట్టకేలకు విజయం లభించింది. గతరాత్రి హైదరాబాద్‌ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో టోర్నీ నుంచి ఇంటిబాట పట్టే ప్రమాదం నుంచి ఆ జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (Faf du Plessis) దీనిపై మాట్లాడుతూ.. విజయమే జట్టులో విశ్వాసం నింపగలదని అన్నాడు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని