ఆ రెస్టారెంటుకు 291 ఏళ్లు!

ఆ రెస్టారెంటు పెద్దదేం కాదు..కానీ దేశదేశాల అతిథులు వస్తుంటారు...అందులో ప్రత్యేకమైన వంటకాలేమీ చేయరు...కానీ గిన్నిస్‌ రికార్డు కొట్టింది...ఇంతకీ దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Published : 25 Mar 2016 02:08 IST

ఆ రెస్టారెంటుకు 291 ఏళ్లు!

ఆ రెస్టారెంటు పెద్దదేం కాదు..కానీ దేశదేశాల అతిథులు వస్తుంటారు...అందులో ప్రత్యేకమైన వంటకాలేమీ చేయరు...కానీ గిన్నిస్‌ రికార్డు కొట్టింది...ఇంతకీ దాని ప్రత్యేకతేంటో తెలుసా?

క కంపెనీ స్థాపించి వందేళ్లయ్యిందంటే మహా గొప్పగా చెబుతుంటారు. మరి ఒక రెస్టారెంటు పెట్టి ఏకంగా 291 ఏళ్లు దాటితే? దానికి గిన్నిస్‌ రికార్డు రాకుండా ఎలా ఉంటుంది? ఇంతకీ ఈ రెస్టారెంటు ఎక్కడుందో తెలుసా? స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ నగరంలో.

*పేరు సోబ్రినో డి బొటిన్‌. ప్రపంచంలోనే ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న అతి పురాతన రెస్టారెంటు (ఆహారశాల)గా దీనికి ప్రపంచ రికార్డు వచ్చింది.

*జీన్‌ బొటిన్‌ అనే వంటమనిషి ఆయన భార్యతో కలిసి 1725లో ఈ రెస్టారెంటును ప్రారంభించాడు. అలా అప్పటి నుంచీ ఇది నేటి వరకు నడుస్తూనే ఉంది.

* ఇక్కడ సంప్రదాయమైన వంటకాలు ఎంతో పసందుగా, తాజాగా వండిపెడతారు. అందుకే ఇన్నేళ్లయినా ఆదరణ తగ్గలేదు. 

* ఇది శాకాహారులకు మింగుడుపడని రెస్టారెంటేనని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా పంది మాంసం, గొర్రె మాంసాలను రుచికరంగా వండి వడ్డిస్తారు.

* ఈ రెస్టారెంటుకు గొప్ప చరిత్ర ఉండడంతో ఇదో పర్యటక ఆకర్షణగా మారింది. ఇక్కడికి దేశదేశాలనుంచి ప్రముఖులు, హాలీవుడ్‌ నటులు వస్తుంటారు. అంతేకాదు దీని గురించి ఎన్నో నవలల్లో ప్రస్తావించారు.

* ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌’ మ్యాగజైన్‌లో కూడా ఈ రెస్టారెంటు గురించి ఇచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని