Phone Tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లపై తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది.

Updated : 26 Apr 2024 17:40 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్‌ పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఇదే కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్‌రావు కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాధాకిషన్‌రావు పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని