ధగధగలాడే డబ్బు చెట్లు!

చెట్లకు పండ్లుంటాయి... ఆకులుంటాయి... పువ్వులుంటాయి... కానీ డబ్బులుండటం తెలుసా? ఉత్తుత్తివి కాదు... నిజమైనవే! గబగబా ఆ వివరాలు చదివేయండి మరి! అమ్మను రోజూ డబ్బులు అడుగుతూ విసిగిస్తే ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’ అంటూ మనల్ని మందలిస్తుంది.

Published : 13 Jan 2017 01:31 IST

ధగధగలాడే డబ్బు చెట్లు!

చెట్లకు పండ్లుంటాయి... ఆకులుంటాయి... పువ్వులుంటాయి... కానీ డబ్బులుండటం తెలుసా? ఉత్తుత్తివి కాదు... నిజమైనవే! గబగబా ఆ వివరాలు చదివేయండి మరి!
మ్మను రోజూ డబ్బులు అడుగుతూ విసిగిస్తే ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’ అంటూ మనల్ని మందలిస్తుంది. ఈసారి అమ్మ అలా అన్నప్పుడు ‘అవును, చెట్లకు డబ్బులు నిజంగానే కాస్తాయి’ అని ధీమాగా చెప్పేయండి. ఎందుకంటే ఓ దగ్గర చెట్లు డబ్బులతో నిండి ఉంటాయి. ఎక్కడబ్బా?
* ఇంగ్లండ్‌లోని ఉడ్‌ల్యాండ్‌లో చాలా చోట్ల నాణేలతో నిండిన వృక్షాలు కనిపిస్తుంటాయి.
* ఈ చెట్లను అదాటున చూసిన వారు ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఒకటో రెండో కాదు వేలాది నాణేలు చెట్ల బెరడుపై అతుక్కుని ఉంటాయి. అందుకే వీటిని ‘మనీ ట్రీ’లు అని పిలుస్తారు.
* ‘నిజంగానే ఇవేమైనా డబ్బుల్ని కాసే చెట్లేమో... వెళ్లి కావాల్సినన్ని నాణేలు తెచ్చుకుంటే సరే’ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. కానీ ఇవన్నీ మనుషులు పెట్టినవే.
* ఈ చెట్ల మొదళ్లు, కొమ్మలు, బెరడులు ఎక్కడ చూసినా రకరకాల దేశాలకు చెందిన నాణేలతో దర్శనమిస్తాయి.
* ఈ నాణేలు ఎలా వచ్చాయి అంటే... కొన్ని వందల ఏళ్ల క్రితం అప్పటి స్థానికులు కొన్ని రకాల వృక్షాల్లో చిల్లర డబ్బులు ఉంచేవారట. ఇలా చేస్తే అదృష్టం కలిసివస్తుందనీ, ఈ చెట్లలో ఉన్న ఆత్మలు సంతోషించి తమ కోరికలు తీరుస్తాయనీ నమ్మేవారు. మనవాళ్లు నదుల్లో భక్తితో చిల్లర నాణేలు వేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారుగా అలాగన్నమాట.
* ఇప్పటికీ ఈ చెట్లపై ఉన్నాయని భావించే దైవ సంబంధ ఆత్మల ప్రీతి కోసం స్థానికులు క్రిస్మస్‌ రోజు మిఠాయిలు, బహుమతులు ఉంచుతారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని