Fire accident: అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Updated : 26 Apr 2024 20:33 IST

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి రోప్‌ సాయంతో బయటకు తీసుకొచ్చారు.

కార్మికుల ప్రాణాలు కాపాడిన బాలుడు..

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న నందిగామకు చెందిన సాయిచరణ్‌ అనే బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే అప్రమత్తమై భవనంపైకి ఎక్కి తాడు కట్టడంతో చాలా మంది కార్మికులు రోప్ సాయంతో కిందకు దిగారు. కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయి చరణ్ నేటి హీరో అంటూ పోలీసు అధికారులు బాలుడిని అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు