Kavya Maran - Virat Kohli: కావ్యా మారన్‌పై మీమ్స్‌.. విరాట్‌పై సోడా బాటిల్‌ జోక్స్‌

ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది.

Updated : 26 Apr 2024 19:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. ఐపీఎల్‌లోనే తమపై రికార్డు స్కోరు చేసిన సన్‌రైజర్స్‌ను బెంగళూరు అడ్డుకొంది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే, విరాట్ కోహ్లీ (Virat Kohli) నెమ్మదిగా ఆడటంపై నెట్టింట విమర్శలు వస్తుండగా.. మరోసారి ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) మీమర్స్‌కు ఫెస్ట్‌గా మారారు. 

బెంగళూరును 206 పరుగులకే పరిమితం చేసినప్పటికీ.. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 171 పరుగులే చేయగలిగింది. తన టీమ్‌ ఆటగాళ్లు వికెట్లను సమర్పించుకుంటున్న సమయంలో కావ్యా మారన్‌ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆమె పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇలానా ఆడేది విరాట్? 

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. కానీ, అది ఆ జట్టు అభిమానులకు పెద్దగా సంతోషం కలిగించలేదు. దీనికి కారణం విరాట్ కోహ్లీ ఆటతీరు. అతడి స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ నెమ్మదిస్తోందని కామెంట్లు వచ్చాయి. దీంతో విరాట్‌ ఆటపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. అందుకు తగ్గట్టు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మొదట్లో 18 బంతుల్లోనే 32 పరుగులు చేసిన కోహ్లీ.. పవర్‌ ప్లే ముగిశాక 25 బంతులను ఎదుర్కొని కేవలం 19 రన్స్‌ చేయడం గమనార్హం. మొత్తం 118 స్ట్రైక్‌రేట్‌తో 51(43) పరుగులు రాబట్టాడు.

విరాట్ ఇన్నింగ్స్‌ను సోడా బాటిల్‌తో పోలుస్తూ ఓ అభిమాని పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘మూత తీయగానే సోడా బాటిల్‌ బుస్‌ మంటూ పొంగుతుంది. ఆ తర్వాత ఏమీ ఉండదు’’ అనే అర్థంలో క్యాప్షన్‌ రాసుకొచ్చాడు.

‘‘ఫ్లాట్‌ పిచ్‌పై ఎదురు దాడి చేయకుండా ఆడితే ఎలా? కనీసం బెంగళూరు బౌలింగ్‌నైనా దృష్టిలో ఉంచుకుని పరుగులు చేస్తే బాగుండేది. ‘ఇంపాక్ట్‌ రూల్’ వల్ల అదనంగా ప్రత్యర్థికి ఒక బ్యాటర్‌ వస్తాడు’’

‘‘ఒకవేళ రోహిత్ శర్మ ఇలాంటి ఇన్నింగ్సే ఆడి ఉంటే.. భారత జట్టు నుంచి అతడిని తప్పించాలని విరాట్ అభిమానులు డిమాండ్ చేసేవాళ్లే’’

‘‘కోహ్లీ ఇన్నింగ్స్‌ను చూశాక.. ఫెర్రారీ కారుతో రద్దీ రోడ్లపై వెళ్లినట్లుంది’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని