బుద్ధుడు పుట్టింది ఇక్కడే!

నేపాల్‌... మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. మన దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది. హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్‌, భారత్‌, చైనా, పాకిస్థాన్‌లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉందీ ఇక్కడే. మౌంట్‌ ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు.

Published : 19 Mar 2017 01:22 IST

బుద్ధుడు పుట్టింది ఇక్కడే!
నేపాల్‌

* నేపాల్‌... మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. మన దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది.
* హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్‌, భారత్‌, చైనా, పాకిస్థాన్‌లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉందీ ఇక్కడే. మౌంట్‌ ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు.
* నేపాల్‌ బుద్ధుడి జన్మస్థలం. క్రీస్తు పూర్వం 563లో గౌతమ బుద్ధుడు ఇక్కడి లుంబినిలో జన్మించాడు. ఇప్పుడు ఈ ప్రాంతం బౌద్ధులకు పవిత్రస్థలం.
దేశం: నేపాల్‌
రాజధాని: కాఠ్‌మాండూ
జనాభా: 2,64,94,504
విస్తీర్ణం: 1,47,181చదరపు కిలోమీటర్లు
భాష: నేపాలీ
కరెన్సీ: నేపాలిస్‌ రూపీ
* ఈ దేశానికి స్వాతంత్య్ర దినం లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడూ పరాయి దేశాల పరిపాలనలో లేదు.
* ఈ దేశ పటాన్ని 90 డిగ్రీల కోణంలో తిప్పితే అచ్చు పోర్చుగల్‌ దేశ పటంలానే ఉంటుందట.
* నేపాల్‌ జాతీయ జంతువు ఆవు. గోవధ ఇక్కడ నేరం.
* ఈ దేశంలో గౌరవంగా పలకరించడానికి కరచాలనం ఇవ్వరు. రెండు చేతులు జోడించి నమస్తే చెబుతారు.
జెండా: ప్రపంచంలో ఏ దేశ జెండా అయినా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. కానీ నేపాల్‌ జెండా అందుకు భిన్నం. నీలం అంచుతో ఉండే ఎరుపు రంగు త్రిభుజాకారాలు రెండు ఉంటాయి. వీటిల్లో ఒకటి చంద్రుడికీ, మరోటి సూర్యుడికీ సూచిక.
* ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్‌ 2007లో లౌకికరాజ్యంగా మారింది. ఎన్నోమతాలు సామరస్యంతో కలిసి నివసిస్తున్న ఇక్కడ 81 శాతం మంది హిందువులు ఉంటారు.
* ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు ఉంది ఈ దేశంలోనే.
* మహాపాదిగా చెప్పుకునే ‘యతి’ ఈ దేశ హిమాలయాల్లో కనిపించినట్టు చెబుతారు.

* జీవ వైవిధ్య పరంగా ఈ దేశం ముందంజలో ఉంది. ఇక్కడ వేలాది రకాల జీవులుంటాయి. 900 రకాల పక్షి జాతులుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షి జాతుల్లో 8.9 శాతం ఇక్కడే కనిపిస్తాయి. 4.2 శాతం సీతాకోక చిలుకలు, 3.96 క్షీరదాలు ఉంటాయి. అందుకే నేపాల్‌ని ‘అమెజాన్‌ ఆఫ్‌ ఆసియా’గా పిలుస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని