Samyuktha: తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త

మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త.

Updated : 10 May 2024 11:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్రసీమలోకి వచ్చిన కొంత కాలంలోనే విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు సంయుక్త. ప్రస్తుతం తెలుగుతోపాటు మలయాళ భాషల్లో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్‌లో నటించాలంటే కష్టమన్నారు.

‘మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం. భాష రాకపోవడం ఒక కారణమైతే.. మేకప్‌ మరో కారణం. వినడానికి వింతగా ఉన్నా.. నా వరకు అది చాలా పెద్ద విషయం. మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్‌ వేసుకోవడం వెంటనే అయిపోతుంది. చాలా లైట్‌గా, సహజంగా వేస్తారు. యాక్టింగ్‌ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, టాలీవుడ్‌లో స్వీయ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. తెరపై ఎలా కనిపిస్తామా.. అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ మేకప్‌ వేస్తారు. షాట్‌ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను చెక్‌ చేసుకోవాలి. ఇది సౌకర్యానికి పూర్తి విరుద్ధం. చర్మం, ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంటుంది’ అని చెప్పారు. 

 పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ

ప్రస్తుతం ఆమె తెలుగులో నిఖిల్‌ ‘స్వయంభూ’లో నటిస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఇది రానుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీనితో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా మూన్‌ షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై రానున్న సినిమాలోనూ ఈమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని