నైలు నదికి మూలం... ఆఫ్రికా ముత్యం!

ఉగాండా అనే పేరు బుగాండా రాజ్యం పేరు మీదుగా వచ్చింది. 1962లో బ్రిటిష్‌ పరిపాలన నుంచి స్వాతంత్య్రం పొందిందిది. ప్రపంచంలో అతి పొడవైన నైలు నది పుట్టింది ఈ దేశంలోనే. ఈ దేశానికి జాతీయ పుష్పం లేదు. 1700 నుంచి 2,300 సంవత్సరాల క్రితం వరకు ఉగాండా ప్రజలకు వేటే జీవనాధారం.

Published : 26 Mar 2017 01:18 IST

నైలు నదికి మూలం... ఆఫ్రికా ముత్యం!
ఉగాండా

* ఉగాండా అనే పేరు బుగాండా రాజ్యం పేరు మీదుగా వచ్చింది.
* 1962లో బ్రిటిష్‌ పరిపాలన నుంచి స్వాతంత్య్రం పొందిందిది.
* ప్రపంచంలో అతి పొడవైన నైలు నది పుట్టింది ఈ దేశంలోనే.
* ఈ దేశానికి జాతీయ పుష్పం లేదు.


* 1700 నుంచి 2,300 సంవత్సరాల క్రితం వరకు ఉగాండా ప్రజలకు వేటే జీవనాధారం.

* ఉగాండా... తూర్పు ఆఫ్రికాలోని ఓ దేశం. ఉత్తరాన దక్షిణ సూడాన్‌, తూర్పున కెన్యా, దక్షిణాన టాంజానియా, పశ్చిమాన కాంగో దేశాలు దీనికి సరిహద్దులు.
* చుట్టూ భూభాగాలతో ఉన్న దేశాల్లో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం.
* ఈ దేశంలో ఎక్కడపడితే అక్కడ నడవడానికి వీలు ఉండదు. కొన్ని ప్రదేశాల్లో నడకకు అనుమతించరు.
* ఇక్కడ స్థానికంగా మాట్లాడే భాషల సంఖ్య 30 కన్నా ఎక్కువ.


* చాలా వూళ్లలో ప్రయాణికుల కోసం ‘బోడా బోడా’ అనే మోటార్‌ సైకిల్‌ టాక్సీలు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా దూసుకెళుతూ కొత్త వారిని చాలా భయపెట్టేలా ఉంటాయి.


* ఉగాండాను ‘ఆఫ్రికా ముత్యం’ అనే ముద్దుపేరుతో పిలుస్తారు.
* యువజనాభా ఎక్కువున్న దేశాల్లో ఇదొకటి. జనాభా మొత్తంలో 70 శాతం మంది 25 సంవత్సరాల లోపున్నవారే.
* ప్రపంచం మొత్తంలో ఉన్న 880 మౌంటెన్‌ గొరిల్లాల్లో సగం ఈ దేశంలోనే ఉన్నాయి.
* ఉగాండా మంచి పర్యటక ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ఏటా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పది లక్షలకుపైనే.
* ఇక్కడ ఆడవాళ్లు పొట్టి దుస్తులను వేసుకోవడం తప్పుగా భావిస్తారు.


జెండా: నలుపు, పసుపు, ఎరుపు రంగులు ఉగాండా ప్రజలకూ, సూర్యకాంతికీ, ప్రజల మధ్య ఉండే సోదరభావానికీ సూచికలు.


* ఈ దేశ ప్రజలు చెట్లను ఎక్కువగా ఇష్టపడతారు. చెట్లను నరికివేస్తే ఓ ప్రత్యేక నిబంధన కూడా పెట్టుకున్నారు. ఒక చెట్టు నరికివేతకు తప్పకుండా మూడు మొక్కలు నాటాల్సిందే.
* రకరకాల అరటిపండ్లు పండుతాయిక్కడ. అనాస పండ్లకు ఈ దేశం ప్రసిద్ధి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని