‘దొంగ దొంగ‌’... అనే అరుపులు వినపడవిక్కడ!

యూరప్‌లోని ఒక చిన్న దేశం. ఇది పైరెనీస్‌ పర్వతాలకు తూర్పున ఉంటుంది. స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాలు సరిహద్దులు. జెండా: జెండా రంగులన్నీ ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల నుంచి పొందిన స్వాతంత్య్రానికి గుర్తులు. నీలం, ఎరుపు ఫ్రాన్స్‌ నుంచి, ఎరుపు, పసుపు స్పెయిన్‌ నుంచి తీసుకున్నారు. ఈ దేశ సైనికులకు కేటాయించే బడ్జెట్‌ స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడి ఉంటుంది......

Published : 23 Jul 2017 01:27 IST

‘దొంగ దొంగ‌’...
అనే అరుపులు వినపడవిక్కడ!
అండోరా

* అండోరా... యూరప్‌లోని ఒక చిన్న దేశం. ఇది పైరెనీస్‌ పర్వతాలకు తూర్పున ఉంటుంది. స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాలు సరిహద్దులు.

* జెండా: జెండా రంగులన్నీ ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల నుంచి పొందిన స్వాతంత్య్రానికి గుర్తులు. నీలం, ఎరుపు ఫ్రాన్స్‌ నుంచి, ఎరుపు, పసుపు స్పెయిన్‌ నుంచి తీసుకున్నారు.
* ఈ దేశ సైనికులకు కేటాయించే బడ్జెట్‌ స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడి ఉంటుంది.
* ఈ దేశ రాజధాని అండోరా లా వెల్లా యూరప్‌ మొత్తంలో ఎత్తయిన రాజధాని. సముద్రమట్టానికి 3,356 అడుగుల ఎత్తులో ఉంటుందిది.
* ఇక్కడ అక్షరాస్యత రేటు ఎక్కువ.
* ఇదో మంచి పర్యటక ప్రాంతం. గత ఏడాది కోటి మందికిపైగా పర్యటకులు సందర్శించారీ దేశాన్ని.

* ఇక్కడ కేవలం 2 శాతం భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఎక్కువ భాగం ఆహారం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు.
* ఈ దేశంలో విమానాశ్రయాలు, రైల్వే లైన్లు లేవు. రోడ్డు మార్గం ఎక్కువగా వాడుతారు.


* ప్రపంచంలో సురక్షితమైన దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ దొంగతనాలు చాలా చాలా తక్కువ. జేబు దొంగలు అసలు ఉండరట.
* కాటలాన్‌ ఈ దేశ అధికారిక భాష. ప్రజలు ఫ్రెంచ్‌ కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు.
* కొన్ని సర్వేల ప్రకారం ఈ దేశం ప్రాచీన దేశాల్లో 14వ స్థానంలో ఉంది.

* దేశం: అండోరా రాజధాని: అండోరా లా వెల్లా జనాభా: 85,470 విస్తీర్ణం: 467.63 చదరపు కిలోమీటర్లు కరెన్సీ: యూరో అధికారిక భాషలు: కాటలాన్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌


*
అండోరా అనే పదం అరబిక్‌ భాషలోని అల్‌దురా అనే పదం నుంచి వచ్చిందట. దీనర్థం ‘ముత్యం’ అని.
* కుటుంబ యజమానిగా ఉండే మగవారి దగ్గర ఆత్మరక్షణ కోసం చట్ట ప్రకారం తుపాకీ ఉండొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని