Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 May 2024 16:59 IST

1. ప్రజల భూములు.. ఇప్పుడు సైకో జగన్‌ గుప్పిట్లో..: చంద్రబాబు

 ప్రజల భూములపై జగన్‌ పెత్తనమేంటని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. అప్పుడు కాంగ్రెస్ ఏడుపులు.. ఇప్పుడు పాక్‌ ఆర్తనాదాలు : మోదీ

 కాంగ్రెస్‌ (Congress) దేశాన్ని పాలించిన రోజుల్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రదాడుల తర్వాత ఏమీ చేయలేక, అంతర్జాతీయ వేదికలపై సహాయం కోసం అర్థించేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్ఖండ్‌లో పర్యటిస్తోన్న ఆయన కాంగ్రెస్‌, జేఎంఎం (Jharkhand Mukti Morcha)లపై విమర్శలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘భారత్‌ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్‌ వ్యాఖ్యలపై జైశంకర్‌ కౌంటర్‌!

విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) పేర్కొన్న విషయం తెలిసిందే. చైనా, రష్యా, జపాన్‌లదీ అదే పరిస్థితి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తీసేయాల్సిన అవసరమేంటి?: పవన్‌

జగన్‌ది డబుల్‌ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారిపోయింది. ఆకట్టుకొనేలా రెజ్యూమెను రూపొందించడమే కాదు.. రిక్రూటర్‌ను మెప్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగార్థులు. కొందరైతే ఎంతోకొంత ‘ముట్టచెప్పేందుకూ’ వెనకాడటం లేదు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వ్యవస్థాపకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్‌ దౌత్యవేత్త..!

భారత్‌లోని అఫ్గానిస్థాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జకియా వార్ధక్‌ స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో ఆమెను అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు.. ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్‌ షర్మిల

జగన్‌ హామీలన్నీ ఫ్యాన్‌ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా వైకాపా ముఖ్యులంతా ఓ ముఠాగా ఏర్పడి అధికారాన్ని అక్రమాల కోసం వినియోగించారని విమర్శించారు. కడప అభివృద్ధిని విస్మరించి, కనీసం తాగునీటిని కూడా ఇవ్వని వైకాపా నాయకులకు ఓటెందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కేసీఆర్‌.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్‌

కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్‌ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌.. భాజపాలో చేరతారని మేం మొదటి నుంచి చెబుతున్నాం. కేంద్రంలో భాజపా చేసిన అన్ని చట్టాలకు భారాస మద్దతిచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. జగన్‌ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్‌ షర్మిల

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శనివారం కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ జగన్‌ కేసులకు సంబంధించి తొలుత సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సార్ పేరు లేదు. కుట్ర పూరితంగా ఆయన పేరు చేర్చారు’’ అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. 17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష

తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2020-2023 మధ్య కాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన నర్సు హీథర్ ప్రెస్‌డీ(41)  వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని