Nithin Kamath: నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్‌ కాల్స్‌పై జిరోదా సీఈవో పోస్ట్‌

Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్‌ కామత్‌. స్పామ్‌ కాల్స్‌పై ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Published : 04 May 2024 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థ జిరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath) తన సోషల్‌మీడియా ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. టెలీమార్కెటింగ్‌ కాల్స్‌తో తన కెరీర్‌ తొలి రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నానని అన్నారు. అందుకే తన ఫోన్‌ను ఎప్పుడూ సైలెంట్‌లోనే ఉంచుతానని చెప్పారు. అసలేం జరిగిందంటే..

నితిన్‌ కామత్‌ తన కెరీర్ తొలినాళ్లలో అమెరికాలోని ఓ కాల్‌ సెంటర్‌ (Call Center)లో పని చేశారు. నాడు తన సహోద్యోగులతో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్‌ చేసిన ఆయన.. ‘‘టెలీ మార్కెటింగ్‌ వల్ల నా ఫోన్ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. ఎప్పుడూ సైలెంట్‌లోనే ఉంచాల్సి వస్తోంది. నేను చేసిన పాపం ఇంకో మార్గంలో నాకే తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది. నేను నాలుగేళ్ల పాటు ఓ కాల్‌సెంటర్‌లో పనిచేశా. అమెరికాలోని ఎంతోమందికి అనవసర కాల్స్‌ చేశా. ఇప్పుడదే కర్మ నన్ను కొట్టినట్లుగా ఉంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!

ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్ పాక్షిక పక్షవాతానికి గురైన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, నిద్రలేమి, తీవ్ర మానసిక అలసట, డీహైడ్రేషన్‌, పనిఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దాన్నుంచి కోలుకుంటున్న ఆయన.. ఇటీవల జిరో1 ఫెస్ట్‌లో పాల్గొన్నారు. అనారోగ్యం తర్వాత ఆయన బయటకు రావడం అదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని