ఈ చెట్లకు సిగ్గెక్కువ!

కొన్ని రకాల చెట్లున్నాయి... ఒకటినొకటి అస్సలు ముట్టుకోవు... ఎందుకో ఏమిటో?వెంటనే తెలుసుకోవాలనుందా?....

Published : 05 Jan 2018 02:01 IST

ఈ చెట్లకు సిగ్గెక్కువ!

కొన్ని రకాల చెట్లున్నాయి... ఒకటినొకటి అస్సలు ముట్టుకోవు... ఎందుకో ఏమిటో?వెంటనే తెలుసుకోవాలనుందా?ఆలస్యం దేనికి చదివేయండి మరి!


‘నేలపై నెర్రలు ఏర్పడటం చూశాం కానీ ఇదేంటీ చెట్ల మధ్య పగుళ్లు కనిపిస్తున్నాయి’ అనుకుంటారు ఈ ఫొటోల్ని చూసినవారెవరైనా. దీనికి కారణం చెట్లకున్న ఓ గమ్మత్తయిన తీరు. దీన్ని ‘క్రౌన్‌ షైనెస్‌’ అని పిలుస్తారు.
* ఈ స్వభావం వల్లే చెట్లు ఒకదాన్నొకటి ‘అంటను ముట్టను’ అన్నట్లు భలేగా పెరుగుతాయి. గుబుర్లు గుబుర్లుగా, చెట్ల కొమ్మలన్నీ దట్టమైన ఆకులతో ఉన్నా పక్క చెట్టుకు తగలకుండా ఉంటాయి. అందుకే ఈ వృక్షాల పందిర్లపైన చివర్లో సన్నని కాలువల్లా ఖాళీ స్థలం కనిపించేస్తుంది. చూడ్డానికి ఎవరో గీసిన చిత్రలేఖనంలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అందుకే ఫొటోగ్రాఫర్లు కూడా కింది నుంచి వీటి అందాల్ని కెమెరాల్లో బంధించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.


* ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా దేశాల్లోని అడవుల్లో డ్రయోబలనొప్స్‌, యూకలిప్టస్‌ వంటి కొన్ని రకాల జాతి చెట్లలో చూడొచ్చు ఈ తీరు.
* మొదటిసారిగా 1920లో చెట్లలోని ఈ క్రౌన్‌ షైనెస్‌ గురించి ప్రపంచానికి తెలిసింది.
* టచ్‌ మి నాట్‌ అన్నట్టు చెట్లలో ఈ వింతేంటో అన్న దానిపై భిన్నమైన కారణాలున్నాయి అంటూ చెబుతున్నారు పరిశోధకులు. ఒకటేమో... ఆకులు తినే ఓ రకమైన పురుగులు ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి చేరకుండా ఉండటానికే ఈ చెట్లు ఇలా ఖాళీ స్థలాల్ని వదులుతూ పెరుగుతాయని. రెండోదేమో ఒక చెట్టు ఆకులు మరో చెట్టుకు తగలకుండా, చెట్ల కిరణజన్యసంయోగ క్రియకు అడ్డు రాకుండా ఉండటానికేనని.
* కారణం కచ్చితంగా తెలియకపోయినా ఈ స్వభావంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయీ చెట్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు