ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సీఈఓలు.. సుందర్‌ పిచాయ్‌ గ్రాడ్యుయేషన్‌ ఫొటో వైరల్‌

గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచాయ్‌ గ్రాడ్యుయేషన్‌ నాటి ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Published : 07 May 2024 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌ (Google) సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai)కి చెందిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన స్నాతకోత్సవం నాటి చిత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాలేజీ రోజుల్లోని పిచాయ్‌ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాదు ఆయనతో పాటు మరో ఐటీ లీడర్‌ శర్మిష్ట దుబే (Sharmistha Dubey) కూడా ఉన్నారు. 

అనన్య లోహిని అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఈ ఫొటోను ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నారు. ‘‘మా నాన్న తన ఐఐటీ కేజీపీ స్నాతకోత్సవం (1993) సమయంలో తీసుకున్న ఫొటో ఇది. నాన్నతో పాటు సుందర్‌ పిచాయ్‌, శర్మిష్ట దుబే ఉన్నారు’’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటో వైరల్‌ అయింది. అప్పటి పిచాయ్‌ ఫొటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో మీ నాన్నగారు ప్రస్తుతం ఏ పని చేస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందంటూ అనన్యని ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో పిచాయ్‌ని ట్యాగ్‌ చేస్తూ స్పందించాలని కోరుకుంటున్నారు.

DM చేస్తేనే స్టోరీ.. షేక్‌ చేస్తే ఫొటో.. ఇన్‌స్టాలో 4 కొత్త ఫీచర్లు

ఇదిలాఉండగా.. సుందర్‌ పిచాయ్‌ ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. ప్రస్తుతం ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌లో సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1993లో స్నాతకోత్సవం సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. అయితే పిచాయ్‌ పక్కన మహిళ శర్మిష్ట దుబే. ఈమె అమెరికన్‌ ఐటీ కంపెనీ మ్యాచ్‌ గ్రూప్‌ మాజీ సీఈఓ. టెక్‌ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దుబే 2006లో మ్యాచ్‌ గ్రూప్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి, 2020లో మ్యాచ్‌ గ్రూప్‌ సీఈఓగా పదోన్నతి పొందారు. వీరిద్దరూ క్లాస్‌మేట్స్‌. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని