Team India: పాక్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీమ్‌ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..

వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనుంది. పాక్‌లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Published : 07 May 2024 17:46 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ పాల్గొనడంపై కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల వల్ల టీమ్‌ఇండియా చాలాకాలంగా పాక్‌ పర్యటనకు వెళ్లడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్‌ కోసం అక్కడికి వెళ్లింది. గతేడాది ఆసియా కప్‌ మ్యాచ్‌లను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు, మిగతా 9 మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. 

ఈనేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాక్‌లో టీమ్ఇండియా పర్యటిస్తుందా, లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత జట్టును పాకిస్థాన్‌కు పంపిస్తామని తెలిపారు. ‘‘ఛాంపియన్స్‌ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఏది చెబితే అదే చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చినప్పుడే మేము మా బృందాన్ని పాకిస్థాన్‌కు పంపుతాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకువెళ్తాం’’ అని రాజీవ్‌ శుక్లా స్పష్టంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని