నేనేం చేస్తానంటే.. !

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరం ఏం చేద్దామనుకుంటున్నా అంటే ముందుగా టీవీ, ఫోన్‌ చూడటం తగ్గిస్తాను. తర్వాత కాలుష్యాన్ని అరికట్టేందుకు నా వంతు ప్రయత్నంగా మొక్కల్ని నాటుతాను. అలాగే అమ్మానాన్న

Updated : 05 Jan 2022 06:13 IST

మొక్కలు నాటుతాను!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరం ఏం చేద్దామనుకుంటున్నా అంటే ముందుగా టీవీ, ఫోన్‌ చూడటం తగ్గిస్తాను. తర్వాత కాలుష్యాన్ని అరికట్టేందుకు నా వంతు ప్రయత్నంగా మొక్కల్ని నాటుతాను. అలాగే అమ్మానాన్న చెప్పినట్లు వింటాను. పెద్దవారితో గౌరవంగా నడుచుకుంటాను. అందరితో స్నేహపూర్వకంగా మెలగుతాను. నా వస్తువులను, పుస్తకాలను చక్కగా సర్దుకుంటాను. త్వరగా నిద్రలేస్తాను. అమ్మకు సాయం చేస్తాను. నాన్నతో కలిసి వాకింగ్‌కు వెళతాను.

- సముద్రాల సాయి యశ్వంత్‌, ఆరో తరగతి, హైదరాబాద్‌

నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి.

email: hai@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని